
అప్పుడు ‘మీటూ’ నన్ను కాపాడింది: సాయిపల్లవి
లిప్‌లాక్‌పై స్పందించిన నటి
హైదరాబాద్: కథతోపాటు, పాత్రక్కూడా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి కథానాయికగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి సాయిపల్లవి. 2015లో విడుదలైన ‘ప్రేమమ్’ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఈమె.. తక్కువ కాలంలోనే కన్నడ, తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో నటించి వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. కథల ఎంపికలో ఎంతో కచ్చితంగా ఉండే సాయిపల్లవి గ్లామర్ షోకు కాస్త దూరంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వరుస ఆఫర్స్‌తో బిజీగా ఉన్న సాయిపల్లవి తాజాగా తన కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితి గురించి వెల్లడించారు. అంతేకాకుండా ‘మీటూ’ ఉద్యమం తనని కాపాడిందని తెలిపారు.
‘లిప్‌లాక్ సన్నివేశాలకు నేను కొంచెం దూరంగా ఉంటాను. అయితే ఓ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు.. హీరోతో లిప్‌లాక్ సన్నివేశాలు చేయాలని దర్శకుడు చెప్పారు. నేను దానికి ఒప్పుకోలేదు. ఆయన మరలా అడిగినప్పటికీ నేను అంగీకరించలేదు. దీంతో, అక్కడే ఉన్న నటుడు.. ‘తనకిష్టంలేదనప్పుడు వదిలేయండి. ఒకవేళ ఇప్పుడు తను బయటకు వెళ్లి ‘మీటూ’ ఆరోపణలు చేస్తే?’ అని అన్నాడు. నాకలాంటి ఉద్దేశం లేనప్పటికీ నటుడు చెప్పిన మాటతో దర్శకుడు సైలెంట్ అయ్యాడు. కేవలం, సరదాగా అడిగానని చెప్పాడు. నిజం చెప్పాలంటే ‘మీటూ’ ఉద్యమమే అలాంటి ఇబ్బందికర పరిస్థితి నుంచి నన్ను కాపాడింది.’ అని సాయిపల్లవి తెలిపింది.
ఇవీ చదవండి
రానాతో పనిచేయడం నా అదృష్టం: సాయి పల్లవి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.