The Night Manager: ‘ది నైట్‌ మేనేజర్‌’.. పార్ట్‌ 2 వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

‘ది నైట్‌ మేనేజర్‌’ వెబ్‌సిరీస్‌కు పార్ట్‌ 2 విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే అది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడు? ఏ ఓటీటీలో అంటే?

Updated : 31 May 2023 23:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రముఖ హీరో అనిల్‌ కపూర్‌ (anil kapoor), ఆదిత్యరాయ్‌ కపూర్‌ (adityaroy kapur), శోభిత ధూళిపాళ్ల, తిలోత్తమ షోమ్‌, అరిస్టా మెహతా తదితరులు నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’ (The Night Manager). ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో విడుదలై, ప్రేక్షకుల్ని అలరించిన ఈ సిరీస్‌కు పార్ట్‌ 2 సిద్ధమైంది. అదే ఓటీటీ (ott)లో జూన్‌ 30 నుంచి ‘ది నైట్‌ మేనేజర్‌ 2’ (the night manager 2) స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని సోషల్‌ మీడియా వేదికగా వెబ్‌సిరీస్‌ టీమ్‌ ప్రకటించింది. 

పార్ట్‌ 1 కథ ఇదీ: షాన్‌ సేన్‌గుప్తా (ఆదిత్యరాయ్‌ కపూర్‌) బంగ్లాదేశ్‌లోని ఓ రాయల్‌ హోటల్‌లో నైట్‌ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. ఆపదలో ఉన్నవారికి చేయూతనందిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన సఫీనా (అరిస్టా మెహత) తనను ఇండియాకు పంపించాలని అతడిని ప్రాధేయపడుతుంది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో అల్లర్లు చెలరేగడంతో స్వదేశానికి పంపించడం వీలుపడదని షాన్‌ ఆమెకు చెబుతాడు. అయినా ఆమె వినిపించుకోదు. 14 ఏళ్ల వయసులో తనకు పెళ్లి చేశారని, తన భర్త రెహమాన్‌ (రేష్‌ లంబా) బిజినెస్‌మ్యాన్‌ ముసుగులో ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్‌ అని తెలియజేసే వీడియోను షాన్‌కు పంపిస్తుంది. అదే వీడియో దిల్లీ కేంద్రంగా ఉన్న రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) ఏజెంట్‌ చేతికి చిక్కుతుంది. తమ రహస్యాలను బయటపెట్టిందనే కారణంతో సఫీనాను కొందరు హత్య చేస్తారు. వ్యాపారం పేరుతో ఆయుధాలు సరఫరా చేయాలని రెహమాన్‌తో డీల్‌ కుదుర్చుకున్న శైలేంద్ర (అనిల్‌ కపూర్‌)నే ఆ మర్డర్‌ చేయించాడనే షాన్‌ అనుమానం నిజమైందా? పైకి గొప్ప వ్యాపారవేత్తగా కనిపించే శైలేంద్ర చీకటి వ్యాపారం ఎందుకు చేస్తున్నాడు? ఒకప్పుడు నేవీ అధికారి అయిన షాన్‌.. మేనేజర్‌గా ఎందుకు మారాడు? అన్నదే ఈ సినిమా మిగతా కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని