Ponniyin Selvan: పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌2 విడుదల తేదీ ఫిక్స్‌..!

మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్‌ సెల్వన్‌1 విజయం సాధించడంతో  అందరూ ఈ సినిమా సీక్వెల్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రెండో భాగం విడుదలకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.  

Published : 07 Nov 2022 01:48 IST

హైదరాబాద్‌: ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమా పొన్నియిన్‌ సెల్వన్‌(Ponniyin Selvan). మణిరత్నం(Mani Ratnam) కలల చిత్రంగా సెప్టెంబర్‌ 30న విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకుంది. తమిళంలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని చిత్రబృందం గతంలో తెలిపిన విషయం తెలిసిందే. దీంతో రెండో భాగం ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం పార్ట్‌2 గురించి తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని అంటున్నారు. త్వరలోనే చిత్ర నిర్మాతలు మరిన్ని వివరాలతో ఈ విషయాన్ని ప్రకటించనున్నారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పార్ట్‌2కు సంబంధించిన ఆడియో, ప్రొమోలు విడుదల చేస్తారని సమాచారం.

ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన పొన్నియిన్‌ సెల్వన్‌ అనే నవల ఆధారంగా భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కింది. చోళరాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంది. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మద్రాస్‌ టాకీస్‌ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని