ప్రతీకార మాయాజాలం
ప్రేక్షకుడి మెదడుకు పరీక్షలా ఉంటాయి హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు. చూసిన మొదటిసారి అర్థం కాదు. మళ్లీ మళ్లీ చూసి ఒక్కో చిక్కుముడిని విప్పుకొంటూ అర్థం వెతుక్కోవాల్సిందే. కలల నేపథ్యంలో వచ్చిన ‘ఇన్సెప్షన్’......
ప్రేక్షకాలమ్
సినిమా: ది ప్రెస్టీజ్; భాష: ఇంగ్లిష్; దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్; తారాగణం: క్రిస్టియన్ బేల్, హ్యూజ్ జాక్ మాన్, స్కార్లెట్ జాన్సన్ తదితరులు; విడుదల:2006; నిడివి: 130 నిమిషాలు; ఎక్కడ చూడొచ్చు: నెట్‌ఫ్లిక్స్.
ప్రేక్షకుడి మెదడుకు పరీక్షలా ఉంటాయి హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు. చూసిన మొదటిసారి అర్థం కాదు. మళ్లీ మళ్లీ చూసి ఒక్కో చిక్కుముడిని విప్పుకొంటూ అర్థం వెతుక్కోవాల్సిందే. కలల నేపథ్యంలో వచ్చిన ‘ఇన్సెప్షన్’..., అంతరిక్షం, కాలం ఆధారంగా ‘ఇంటర్ స్టెల్లార్’..., గతేడాది ‘టెనెట్’... ఇలా ఎన్నో సినిమాలు సగటు ప్రేక్షకుడి మెదడుకు పరీక్షల్లాంటివే. అయితే వీటితో పాటు నోలన్ తీసిన మరో సినిమా గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదే ‘ది ప్రెస్టీజ్’. ఇద్దరు వ్యక్తుల మధ్య వైరాన్ని నోలన్ మార్క్ స్క్రీన్‌ప్లే తో ఓ కొత్తరకం రివేంజ్ డ్రామాను హాలీవుడ్‌కి అందించాడు దర్శకుడు. ఆ చిత్ర పరిచయమే నేటి ప్రేక్షకాలమ్. క్రిస్టియన్ బేల్, హ్యూజ్ జాక్ మాన్, స్కార్లెట్ జాన్సన్‌లతో 2006లో నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి క్రిస్టోఫర్ ప్రీస్ట్ రాసిన ‘ది ప్రిస్టేజ్’ పుస్తకం ఆధారం. దీనికి నోలన్ సోదరుడు జొనాథన్ నోలన్ స్క్రీన్ ప్లే అందించారు.
కథ: 19వ శతాబ్దం చివరి రోజుల్లో లండన్‌లో జరిగే కథ ఇది. మ్యాజిక్ ప్రపంచాన్ని ఏలాలని కలలుకనే ఇద్దరు యువకులు ఆంజియర్, బోర్డెన్. వీరిద్దరూ కలిసి జాన్ కట్టర్ దగ్గర సహాయకులుగా పనిచేస్తూ ఉంటారు. ఓ రోజు స్టేజ్ పై ప్రదర్శనలో భాగంగా నీటి తొట్టిలో పడిన ఆంజియర్ భార్య చేతి కట్లు విడిపించుకోలేక అందులోనే ఊపిరాడక చనిపోతుంది. తన భార్య చావుకు బోర్డెన్ కారణమని, ఉద్దేశపూర్వకంగానే కష్టమైన ముడి వేశాడని కోపం పెంచుకుంటాడు ఆంజియర్. దీంతో ఇద్దరు విడిపోయి వేర్వేరుగా మ్యాజిక్ ప్రదర్శనలు ఇస్తుంటారు. బోర్డెన్‌కు ‘క్యాచ్ ది బుల్లెట్’ అనే ట్రిక్‌కి మంచి పేరొస్తుంది. ఓ రోజు ఆంజియర్ మారు వేషంలో వచ్చి బోర్డెన్ ట్రిక్ ను విఫలం చేస్తాడు. దీంతో నిజంగానే బుల్లెట్ తగిలి బోర్డెన్ చేతికి గాయమవుతుంది. అందరి ముందు నవ్వుల పాలవుతాడు. ఇక ఇద్దరి మధ్య శత్రుత్వం మరింతగా పెరుగుతుంది. ఒకరి రహస్యాలు మరొకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటారు. ఉత్తమ మాయాజాలికుడు కావాలనే ఈ హోరాహోరీ పోటీలో ఎవరు గెలిచారు.? ఈ క్రమంలో ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నారు? అనేది మిగతా కథ.
వెంటాడే స్క్రీన్ ప్లే: సినిమా మొదలయ్యే మొదటి సన్నివేశం నుంచి చివరిదాకా ఓ మాయాజాలంలానే ఉంటుంది ‘ది ప్రెస్టేజ్’.. స్క్రీన్ ప్లే. ఇంకా చెప్పాలంటే సినిమా అయ్యాక కూడా దాని మహిమ ప్రేక్షకుడిని వెంటాడుతుంది. ఆంజియర్ గతం, బోర్డెన్ గతంతో పాటు వర్తమానంలో జరిగే కథ.. ఇలా మూడు కథలను సమాంతరంగా చెబుతూ చివరకు ఒక్కచోట కలిపేస్తాడు దర్శకుడు. అయినా ఎక్కడా గందరగోళానికి గురికాకుండా రాసుకోవడంలో నోలన్ కి ఆయనే సాటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోర్డెన్‌కు తెలిసిన ‘ట్రాన్స్పోర్టెడ్ మ్యాన్’ అనే మ్యాజిక్ ట్రిక్‌ను ఛేదించేందుకు ఆంజియర్ చేసే ప్రయత్నాలు... డైరీలో ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకొని పై చేయి సాధించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శత్రువులుగా బేల్, హ్యూజ్ జాక్ మాన్ పోటీపోటీగా నటించారు. వీరందరి కంటే సగటు ప్రేక్షకుడి మనసుపై మాయాజాలం చేసే నోలన్ స్క్రీన్ ప్లే మరింత ఎక్కువగా ఆకట్టుకుంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు