The Warriorr: సత్య... ది వారియర్‌‘

వీలైతే మారిపోండి... లేకపోతే పారిపోండి’ అంటూ గ్యాంగ్‌స్టర్స్‌ని హెచ్చరిస్తున్నాడు డీఎస్పీ సత్య. ఊరికి కొత్తగా వచ్చిన ఆ యువ పోలీస్‌ అధికారి రౌడీల వెన్నులో వణుకు పుట్టించాడు. ఆ కథేమిటో తెలియాలంటే ‘ది వారియర్‌’ చూడాల్సిందే. రామ్‌ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది.

Updated : 15 May 2022 09:07 IST

వీలైతే మారిపోండి... లేకపోతే పారిపోండి’ అంటూ గ్యాంగ్‌స్టర్స్‌ని హెచ్చరిస్తున్నాడు డీఎస్పీ సత్య. ఊరికి కొత్తగా వచ్చిన ఆ యువ పోలీస్‌ అధికారి రౌడీల వెన్నులో వణుకు పుట్టించాడు. ఆ కథేమిటో తెలియాలంటే ‘ది వారియర్‌’ చూడాల్సిందే. రామ్‌ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. కృతిశెట్టి కథానాయిక. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడు. చిత్రం జులై 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 15 రామ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా శనివారం టీజర్‌ని విడుదల చేశారు. ‘డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సత్య పోరీని నేను’ అంటూ కథానాయిక, ‘ఆట బానే ఉంది, ఆడేద్దాం’ అంటూ ప్రతినాయకుడు, ‘పాన్‌ ఇండియా సినిమా చూసుంటారు, పాన్‌ ఇండియా రౌడీస్‌ని చూశారా?’ అంటూ కథానాయకుడు, ‘ధైర్యం అంటే వెతుక్కుంటూ వచ్చినవాళ్లని కొట్టడం కాదు, వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం’ అంటూ నదియా చెప్పిన సంభాషణలు టీజర్‌కి ఆకర్షణగా నిలిచాయి. నిర్మాత మాట్లాడుతూ ‘‘తెరపైన రామ్‌, తెర వెనక లింగుస్వామి మంచి పనితీరుని కనబరిచారు. టీజర్‌కి లభిస్తున్న స్పందన చాలా బాగుంది. ప్రేక్షకుల అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందీ చిత్రం. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 22 నుంచి    హైదరాబాద్‌లో ఆ పాటని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ’’ని తెలిపారు. అక్షరగౌడ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: సుజీత్‌ వాసుదేవ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని