The Warriorr: రామ్‌ ‘ది వారియర్‌’.. ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది

రామ్‌ నటించిన యాక్షన్‌ చిత్రం ‘ది వారియర్‌’ ఓటీటీ విడుదల ఖరారైంది. కృతిశెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందంటే....

Updated : 07 Dec 2022 15:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ నటుడు రామ్‌ పోతినేని (Ram Pothineni), కోలీవుడ్‌ దర్శకుడు లింగు స్వామి (Lingusamy) కాంబినేషన్‌లో తెరకెక్కించిన చిత్రం ‘ది వారియర్‌’ (The Warriorr). కృతిశెట్టి కథానాయిక. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో (Disney+ Hotstar) ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. జులై 14న థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ యాక్షన్‌ చిత్రంలో విలన్‌ ఆది పినిశెట్టి- హీరో రామ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రామ్‌.. సత్య అనే పోలీసు పాత్ర పోషించారు. విధుల్లో చేరగానే ఆ ఊరి గ్యాంగ్‌స్టర్‌ గురు (ఆది పినిశెట్టి)పై దృష్టి పెడతాడు. గురుపై విజయం సాధించేందుకు సత్య ఎలాంటి ఆపరేషన్‌ చేపట్టాడు? ఆ క్రమంలో ఆయన ఎదుర్కొన సవాళ్లేంటి? విజిల్‌ మహాలక్ష్మి (కృతిశెట్టి)గా ఫేమస్‌ అయిన అమ్మాయితో సత్యకి ఉన్న సంబంధమేంటి? అనే విషయాలు ఈ కథలో ఆసక్తికరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని