Avatar-2: విడుదలకు ముందే కోట్లు కురిపిస్తున్న అవతార్.. కళ్లు చెదిరే బుకింగ్స్..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా అవతార్2(Avatar2). ఈ చిత్రం టికెట్ బుకింగ్స్‌లో కొత్త రికార్డులను సృష్టించేలా ఉంది.
హైదరాబాద్: జేమ్స్ కామెరూన్(James Cameron) అద్భుత సృష్టి అవతార్. ఈ సినిమా సీక్వెల్‌గా ‘అవతార్-2’(Avatar-2) ది వే ఆఫ్ వాటర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 16న ఈ చిత్రం విడుదలవ్వనుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే వండర్స్ క్రియేట్ చేస్తోంది. తాజాగా బుకింగ్స్ ఓపెన్ కాగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలిరోజే దాదాపు 2 లక్షల మంది టికెట్లను కొనుగోలు చేశారు. దీంతో ఆల్ ఇండియా మొత్తం రూ.7 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న కేజీఎఫ్2, బాహుబలి2 సినిమాలను సవాలు చేస్తూ ఆల్ టైమ్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో అవతార్2 ఒకటిగా నిలిచింది. ఇప్పటి వరకు అమ్ముడుపోయిన టికెట్స్‌లో సుమారు లక్షకు పైగా కేవలం పీవీఆర్(PVR), ఐనాక్స్(Inox) ,సినీపోలిస్(Cinepolis)లలోనే బుక్ చేసుకోవడం గమనార్హం.
ఇక అవతార్ టికెట్స్ వారంతం(weekend) బుకింగ్స్ చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. వీకెండ్లో సుమారు 4.10 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది త్వరలోనే 5లక్షల మార్కును చేరడానికి సిద్ధంగా ఉంది. దీంతో వారంతపు గ్రాస్ రూ.16 కోట్లకు చేరింది. మొత్తం అవతార్ సినిమా ప్రీసేల్ (pre-sale) బుకింగ్స్ రూ.45 కోట్ల నుంచి రూ.80 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.
అవతార్ మొదటి భాగంలో పండారా గ్రహంలో ఊరేగించిన జేమ్స్ కామెరూన్.. రెండో భాగంలో సముద్ర గర్భంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన ప్రమోషనల్ టూర్లో నిర్మాత జోన్ లాండౌ(Jon Landau) మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘‘అవతార్ ఐదో భాగం(Avatar 5) 2028లో వచ్చే అవకాశం ఉంది. అందులో సినిమాలోని పాత్రలన్నీ ఒక మంచిపని కోసం భూమి పైకి వస్తాయి’’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రికార్డు సృష్టించిన మలయాళ చిత్రం.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ హిట్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో విడుదల కానుంది. ఎప్పుడంటే? -
RC17: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో అదే హైలైట్: రాజమౌళి
రామ్ చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు. -
RC17: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబో
రామ్ చరణ్ కొత్త చిత్రం ప్రకటించారు. స్టార్ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్టుకు (#RC17) శ్రీకారం చుట్టారు. -
priyadarshi: ప్రియదర్శి- ఇంద్రగంటి కొత్త సినిమా ప్రారంభం
ప్రియదర్శి కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. -
Kamal Haasan: మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చిన కమల్ హాసన్.. ‘కల్కి’ గురించి ఏమన్నారంటే!
తాను నటిస్తోన్న సినిమాల అప్డేట్లను కమల్ హాసన్ పంచుకున్నారు. -
upcoming movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
upcoming movies: మార్చి ఆఖరి వారంలో అటు థియేటర్లో పాటు, ఇటు ఓటీటీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి చిత్రాలు సిద్ధమవుతున్నాయి. -
War 2: వార్2లో కంపోజర్ ప్రీతమ్ భాగం కానున్నారా?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. -
Double Ismart Movie Update: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌పై రామ్ కామెంట్స్.. ఏమన్నారంటే!
‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రిలీజ్ డేట్‌పై రామ్ కామెంట్ చేశారు. -
Kalki 2898AD: ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
Devara: ‘దేవర’లో మరాఠీ బ్యూటీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన నటి!
ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి వెల్లడించారు. -
SSMB29: మహేశ్-రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచేసిన కార్తికేయ.. ఏమన్నారంటే!
రాజమౌళి-మహేశ్ సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ కామెంట్ చేశారు. -
Shiva Rajkumar: ఇది మరో స్థాయిలో ఉంటుంది: రామ్ చరణ్ చిత్రంపై శివ రాజ్‌కుమార్
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. -
Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్ కాఫీ మాత్రమే తాగా: పృథ్వీరాజ్
Aadujeevitham: పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించిన ‘ఆడుజీవితం’ షూటింగ్ విశేషాలను ఆయన పంచుకున్నారు. -
Pushpa2: ‘పుష్ప2’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రష్మిక..ఫొటో వైరల్
‘పుష్ప2’ షూటింగ్ ప్రస్తుతం యాగంటిలో జరుగుతున్నట్లు రష్మిక తెలిపారు. -
Dhanush: అందుకు నేను గర్వపడుతున్నా: ధనుష్
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా రానుంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కింది. -
RamCharan: అట్టహాసంగా రామ్‌చరణ్ కొత్త సినిమా ప్రారంభం
రామ్‌చరణ్ (Ram Charan) కొత్త సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
మలయాళ చిత్ర పరిశ్రమలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ రికార్డు సృష్టించింది. అదేంటంటే? -
Fahadh Faasil: రాజమౌళి సమర్పణ.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫహద్ ఫాజిల్ మూవీస్
Fahadh Faasil: విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. -
upcoming movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో థ్రిల్లింగ్ కంటెంట్
గత వారం బాక్సాఫీస్ వద్ద పదికి పైగా చిన్న చిత్రాలు సందడి చేయగా, ఈ వారం కూడా అదే పంథా కొనసాగనుంది. థియేటర్లో మరికొన్ని చిన్న సినిమాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి. -
Priyadarshi: ఆ చిత్రానికి, ‘ఓం భీమ్ బుష్’కి పోలిక ఉండదు: ప్రియదర్శి
తన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు ప్రియదర్శి. -
Suriya 43: సూర్య 43వ చిత్రంపై అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
తమిళ హీరో సూర్య కొత్త సినిమా ‘సూర్య43’గురించి మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కొత్త అప్డేట్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
-
ప్రవీణ్‌ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
-
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
-
డీఎస్పీలొస్తుంటారు.. పోతుంటారు ఆ కంత్రీ కానిస్టేబుళ్లు లోకల్