Dhamki: ‘ధమ్కీ’కి బదులు ఆ సినిమా వేసిన థియేటర్‌ సిబ్బంది.. ప్రేక్షకులు షాక్‌

విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) నటించిన సరికొత్త చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

Published : 22 Mar 2023 12:50 IST

హైదరాబాద్‌: విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki). విశ్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంది. నివేదా పేతురాజ్‌ కథానాయిక. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, వైజాగ్ వేదికగా ఈ సినిమా ప్రదర్శనలో గందరగోళ పరిస్థితి నెలకొంది. విశాఖపట్నంలోని సుకన్య థియేటర్‌లో ‘ధమ్కీ’కి బదులు ‘ధమాకా’ (Dhamaka) చిత్రాన్ని ప్రదర్శించారు.  ‘ధమాకా’ అనే టైటిల్‌ స్క్రీన్‌పై కనిపించగానే ప్రేక్షకులు గోల చేశారు. దీనిని గ్రహించిన థియేటర్‌ సిబ్బంది వెంటనే తప్పును సరిదిద్దుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సినిమా పేర్లు రెండూ కాస్త ఒకేలా ఉండటంతో ఈ విధమైన గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఇక, రవితేజ నటించిన ‘ధమాకా’ గతేడాది డిసెంబర్‌లో విడుదలై హిట్‌ అందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని