ఈ యాక్షన్‌ సీన్స్‌ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి.. మీరూ చూస్తారా?

కొన్ని యాక్షన్‌ సీన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. ఎన్నిసార్లు చూసినా, చూడాలనిపిస్తాయి. అలాంటి వాటిలో కొన్నింటిని

Published : 06 Oct 2022 01:36 IST

హైదరాబాద్‌: కొన్ని యాక్షన్‌ సీన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. ఎన్నిసార్లు చూసినా, చూడాలనిపిస్తాయి. అలాంటి వాటిలో కొన్నింటిని జతచేసి, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో యూట్యూబ్‌ వేదికగా పంచుకుంది. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో జక్కారెడ్డిని పుష్పరాజ్‌ కాపాడేసీన్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలాగే మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ తెరకెక్కించిన ‘సర్కారువారి పాట’లోని బీచ్‌ఫైట్‌ సినిమాకే హైలైట్‌. ఈ రెండింటితో పాటు, ‘కడువా’, ‘విరుమన్‌’ చిత్రాల్లోని యాక్షన్‌ సీన్స్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫైట్స్‌ మీరూ చూసేయండి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts