Tollywood: ఈ ముగ్గురు తెలుగు దర్శకులు.. సూర్య, విజయ్‌, దుల్కర్‌తో సినిమాలు..?

ముగ్గురు తెలుగు దర్శకులు.. ఇతర చిత్ర పరిశ్రమల హీరోలతో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం. వారెవరు? ఏ హీరోలతో సినిమా తీయాలనుకుంటున్నారు? 

Published : 17 Apr 2023 22:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు దర్శకులు ఇతర చిత్ర పరిశ్రమల హీరోలతో.. ఇతర సినీ పరిశ్రమలకు చెందిన దర్శకులు టాలీవుడ్‌ కథానాయకులతో కలిసి పనిచేయడం ఇటీవల ఎక్కువైంది. అలా ఇప్పటికే పలు సినిమాలు తెరకెక్కి, ప్రేక్షకులను అలరించాయి. అలాంటి కాంబినేషన్‌లో మరికొన్ని చిత్రాలు రూపొందనున్నానని టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముగ్గురు తెలుగు దర్శకులు పర భాషా కథానాయకులతో సినిమాలు తీసేందుకు ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. అధికారిక ప్రకటనలేదుగానీ.. ఆ కాంబినేషన్‌ వివరాలు సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి.

‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti).. కోలీవుడ్‌ అగ్ర హీరో సూర్య (Suriya)తో సినిమా చేయబోతున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. ‘వీరసింహారెడ్డి’ ఫేం గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni).. తమిళ్‌ అగ్ర కథానాయకుడు విజయ్‌ (Vijay)తో చిత్రం తీయబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పటికే.. తమిళ స్టార్‌ హీరో ధనుష్‌తో ‘సార్‌’ (Sir) సినిమాని తెరకెక్కించి, విజయం అందుకున్న డైరెక్టర్‌ వెంకీ అట్లూరి (Venky Atluri).. మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan)తో ఓ చిత్రం తెరకెక్కించే అవకాశం ఉందని టాక్‌. మరి, వీటిల్లో ముందుగా ఏ కాంబినేషన్‌ పట్టాలెక్కుతుంది?అసలు, ఈ క్రేజీ కాంబోలు వార్తలకే పరిమితమవుతాయా.. కార్యరూపం దాల్చుతాయా?.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ అధికారిక ప్రకటనే సమాధానం.

టాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల ఇప్పటికే ధనుష్‌తో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ వారిసు/వారసుడు సినిమా చేశారు. దుల్కర్‌కు తెలుగు చలన చిత్ర పరిశ్రమ కొత్తేమీ కాదు. ‘మహానటి’, ‘సీతారామం’.. ఆయన తెలుగులో నేరుగా నటించిన చిత్రాలు. సూర్యకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్నా ‘రక్త చరిత్ర 2’ మినహా ఆయన మరే తెలుగు సినిమాలో నటించలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని