Thimmarusu: ఈ లాయర్‌ కొడితే లైఫ్ అంతా రీసౌండే!

లాయర్‌ సత్యదేవ్‌ అజయ్‌కు వార్నింగ్‌ ఇచ్చే సీన్‌ను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది.

Published : 01 Sep 2021 18:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సత్యదేవ్‌ లాయర్‌గా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ప్రియాంక జవాల్కర్ కథానాయిక. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకుడు. సెకండ్‌వేవ్‌ తర్వాత మొదటిసారి థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమాలోని ఓ పవర్‌ఫుల్‌ సీన్‌ను నెట్‌ఫ్లిక్స్‌ అభిమానులతో పంచుకుంది.హత్య కేసు నిందితుడైన యువకుడిని పోలీస్‌ ఆఫీసర్‌ అజయ్‌ కోర్టులో బెదిరిస్తాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన లాయర్‌ సత్యదేవ్‌ తిరిగి అజయ్‌కు వార్నింగ్‌ ఇచ్చే సీన్‌ థియేటర్‌లో ఈలలు వేయించింది. అదే సీన్‌ను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఆకట్టుకుంటున్న ఆ సీన్‌ మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని