Thiruveer: ఆ స్వేచ్ఛ దొరికింది ఇప్పుడే!
‘‘ఇప్పటివరకూ నన్ను ప్రతినాయక కోణంలోనే చూస్తూ అవకాశాలిచ్చారు. చేసిన సినిమాలు.. పాత్రల ప్రభావం అలాంటిది.
‘‘ఇప్పటివరకూ నన్ను ప్రతినాయక కోణంలోనే చూస్తూ అవకాశాలిచ్చారు. చేసిన సినిమాలు.. పాత్రల ప్రభావం అలాంటిది. ఇప్పటికీ నా దగ్గరికి అలాంటి పాత్రలు వస్తుంటాయి. ఆ ముద్ర నుంచి బయటికి రావడానికి చాలా సమయమే పట్టింది. ‘మసూద’ సినిమాతో నాలోని అమాయకత్వం కూడా బయటికొచ్చింది. ‘పరేషాన్’ (Pareshan)తో నాలోని అన్ని కోణాలూ కనిపిస్తాయి. ఇప్పట్నుంచి కథలు రాసుకునేవాళ్లకి నేనూ ఓ ప్రత్యామ్నాయం అవుతా’’ అన్నారు తిరువీర్ (Thiruveer). ‘పలాస’, ‘ఘాజీ’, ‘టక్ జగదీష్’, ‘మసూద’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకి చేరువైన నటుడీయన. ఆయన ప్రధాన పాత్రధారిగా ‘పరేషాన్’ తెరకెక్కింది. రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా తిరువీర్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘ఇదివరకు చేసిన ‘మసూద’ సీరియస్ కథే అయినా... నేను కనిపించినప్పుడంతా ప్రేక్షకులు నవ్వుకున్నారు. ‘పరేషాన్’ సినిమాతో ఇంకా ఎక్కువగా నవ్వుకుంటారు. ఇందులో ప్రతి పాత్రకీ ఏదో ఒక పరేషాన్ ఉంటుంది. అందుకే ఈ పేరు పెట్టాం. సహజంగా, పాత్రల అమాయకత్వం నుంచి పుట్టిన హాస్యంతో రూపొందిన చిత్రమిది. 2020లో కరోనా తొలి దశలో లాక్‌డౌన్ సడలింపుల తర్వాత చేసిన సినిమా ఇది. నిర్మాణానంతర కార్యక్రమాలే దాదాపుగా 20 నెలలు చేశాం. ఆ కథకి తగ్గట్టుగా సహజత్వం కోసమే ఇదంతా. సింగరేణి కుర్రాళ్ల కథ ఇది. నేనొక పాస్టర్ కొడుకుగా కనిపిస్తా’’.
* ‘‘దర్శకుడు రూపక్ రొనాల్డ్సన్ ఓ నాలుగు సన్నివేశాల కోసం ఆడిషన్ ఆడిగాడు. ఆ నాలుగు సన్నివేశాలు చెప్పినప్పుడే మరేమీ ఆలోచించకుండా నేను ఈ సినిమా చేస్తానని చెప్పా. అంత కొత్తగా అనిపించింది తన రచన. తను చూసిన జీవితం, ఊరు, స్నేహాలు, అక్కడి ప్రజల పాత్రల్ని తీసుకుని ఓ ఊహా ప్రపంచాన్ని సృష్టించారు. కథ, పాత్రలు, లొకేషన్లు... అన్నీ కొత్తగా ఉంటాయి. చిత్రీకరణ కోసం మంచిర్యాలలోనే రెండు నెలలు గడిపా. కేరళలా అనిపించింది ఆ ప్రదేశం. రానా దగ్గుబాటి ఈ సినిమాని చూస్తూ నవ్వుతూనే ఉన్నారు. చూడటం పూర్తయ్యాక ‘నాకు తెలియని ప్రపంచంలోకి నన్ను తీసుకెళ్లిందీ చిత్రం. ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయగలనో చెప్పండి?’ అని అడిగారు. తను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాక తన సొంత సినిమాలా భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్నారు’’.
* ‘‘ఇప్పటివరకూ పాత్రల్ని ఎంపిక చేసుకునే అవకాశమే నాకు రాలేదు. మిగిలిన పాత్రల్నే నేను చేశా. అయితే థియేటర్ ఆర్ట్స్ చేశాక నటుడిగా నేనెలాంటి సినిమాలు చేయాలనుకున్నానో అలాంటివే నాకోసం మిగిలాయి. వాటినే చేశా. ‘మసూద’ తర్వాత అంటే.. ఈ ఏడాది నుంచే నేను కథల్ని, పాత్రల్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ దొరికింది. ఇప్పుడు ఇది చేశాను కాబట్టి, తర్వాత ఇదే చేస్తానని కాకుండా... కథ, కథలోని పాత్ర బాగుంటే చేయడానికి సిద్ధమైపోతున్నా. కొత్తగా నాలుగు సినిమాలు ఒప్పుకున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sapta Sagaralu Dhaati: విడుదలైన వారంలోపే ఓటీటీలోకి.. ‘సప్త సాగరాలు దాటి’
-
Justin Trudeau : నిజ్జర్ విషయంలో అమెరికన్లు మాతోనే : జస్టిన్ ట్రూడో
-
Asian Games: షూటింగ్లో మరో రెండు స్వర్ణాలు.. టెన్నిస్‌లో రజతం
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. 19,550 ఎగువన నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు