Sara Ali Khan: మన‘సారా’ కసరత్తులు..

చిత్ర పరిశ్రమలో స్టార్ల సంతానంగా తొలి అవకాశం తేలికగానే దక్కించుకోవచ్చేమోగానీ.. నిలదొక్కుకోవాలంటే మాత్రం శ్రమించక తప్పదు. ఆర్భాటంగా అడుగుపెట్టినా తమని తాము నిరూపించుకోలేక ఎంతోమంది కనుమరుగైపోయారు.

Updated : 12 Dec 2022 07:22 IST

చిత్ర పరిశ్రమలో స్టార్ల సంతానంగా తొలి అవకాశం తేలికగానే దక్కించుకోవచ్చేమోగానీ.. నిలదొక్కుకోవాలంటే మాత్రం శ్రమించక తప్పదు. ఆర్భాటంగా అడుగుపెట్టినా తమని తాము నిరూపించుకోలేక ఎంతోమంది కనుమరుగైపోయారు. ఆ జాబితాలో ఉండటం నాకిష్టం లేదంటోంది కథానాయిక సారా అలీఖాన్‌ (Sara Alikhan). సైఫ్‌ అలీఖాన్‌, అమృతాసింగ్‌ల ముద్దుల తనయ తను. నాయికానాయకులకు ఫిట్‌నెస్‌ ముఖ్యమనే విషయం తనకి బాగా తెలుసు. అందుకే ఒకప్పుడు చాలా బరువు ఉండే సారా.. బాగా తగ్గి మెరుపుతీగలా మారి అవకాశం అందిపుచ్చుకుంది. దాంతోపాటు ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌ (Fitness) కాపాడుకోవడం కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తూనే ఉంటుంది. ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం ఇస్తూ అత్యధిక గంటలూ జిమ్‌లోనే గడుపుతోంది. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతూ.. స్క్వాట్‌, ప్లాంక్‌ వ్యాయామాలు చేస్తూ, బరువులెత్తుతూ.. ఫుల్‌ ఎనర్జిటిక్‌గా కనిపించిన సారా ఇటీవలే ఓ వీడియోని పంచుకుంది. క్రిస్మస్‌ సెలవుల కోసం ఇలా సన్నద్ధం’ అంటూ ఓ వ్యాఖ్య జోడించింది. ఆమె అంకితభావానికి అభిమానులంతా ‘వావ్‌’ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. సారా ప్రస్తుతం విక్కీ కౌశల్‌తో ఓ చిత్రంతోపాటు, ‘గ్యాస్‌లైట్‌’ అనే మరో సినిమాలో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని