Pushpa: ‘ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా’.. బుడ్డొడు అదగొట్టాడు!

తెలుగుతో పాటు, బాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకున్న చిత్రం ‘పుష్ప’.

Published : 21 Feb 2022 15:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగుతో పాటు, బాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకున్న చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని వివిధ పాత్రలు, పాటలపై వచ్చిన మీమ్స్‌, ఫన్నీ వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా హల్‌చల్‌ చేశాయి. ఇంకా ఆ ట్రెండ్‌ ఏదో విధంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మరో వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. సినిమాలో ‘ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా’ పాట నేపథ్య సంగీతాన్ని ఓ చిన్నారి ఇంట్లో సామాన్లపై వాయించి అదరగొట్టాడు. ఎలాంటి సంగీత పరికరాలు లేకుండా కేవలం రెండు కర్రలతో ఇనుప అలమర, గ్రైండర్‌పై అతడు కొట్టిన మ్యూజిక్‌ నెటిజన్లను అలరిస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా ఈ వీడియోను లైక్‌ చేసింది. కావాలంటే ఈ చిన్నారి టాలెంట్‌ను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని