Ott Movies This week: ఓటీటీలో ఈ వారం సందడే సందడి.. ఏయే చిత్రాలొస్తున్నాయంటే?

సెప్టెంబరు నెల చివరి వారంలో వరుస సెలవులు రావడంతో ఒకవైపు థియేటర్‌లో సినిమాలు సందడి చేస్తుండగా, ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సినిమలేంటో చూసేద్దామా?

Published : 27 Sep 2023 13:37 IST

థియేటర్‌లో అలరించి..

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కాగా, ఈ సినిమా ఓటీటీ విడుదలకు (Kushi Ott Release) రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబర్‌ 1 (ఆదివారం) నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.


నిత్యామేనన్‌ బార్‌ పెడితే..

నిత్యామేనన్‌ (Nithya Menen) కీలక పాత్రలో గోమఠేష్‌ ఉపాధ్యాయ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘కుమారి శ్రీమతి’ (Kumari Srimathi). గౌతమి, తిరువీర్‌, నిరుపమ్‌, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్‌, ప్రేమ్‌ సాగర్‌, నరేష్‌, మురళీమోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా సెప్టెంబరు 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. . తాతల నాటి ఇంటిని తిరిగి దక్కించుకునేందుకు ఇటికెల పూడి శ్రీమతి (నిత్యామేనన్‌) బార్‌ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి? మరి ఇంటిని దక్కించుకుని, పెళ్లి చేసుకుందా? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!


ఎట్టకేలకు ఓటీటీలో..

అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ‘ఏజెంట్‌’ (Agent) చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తోంది. ‘సోనీలివ్‌’ (SonyLiv) వేదికగా సెప్టెంబరు  29 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనుంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీసు వద్ద ఏమాత్రం ప్రభావం చూపని సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.


దుల్కర్‌ గ్యాంగస్టర్‌ మూవీ..

దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటించిన గ్యాంగ్‌స్టర్‌ మూవీ ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King Of Kotha). దుల్కర్‌ స్నేహితుడు అభిలాష్‌ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు నెలాఖరులో విడుదలై ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి ప్రవేశించనుంది. డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబర్‌ 29 నుంచి ఇది ప్రసారం కానుంది. మలయాళంతో పాటు, తెలుగులోనూ స్ట్రీమింగ్‌ కానుంది.


పాపం పసివాడు ఏమయ్యాడు?

గాయకుడు శ్రీరామ చంద్ర, గాయత్రి చాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘పాపం పసివాడు’ (Papam pasivadu). వీకెండ్‌ షో బ్యానర్‌పై రూపొందిన ఈ సిరీస్‌ ప్రముఖ తెలుగు ఓటీటీ వేదికగా ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. లవ్‌ ఫెయిల్‌ అయిన అబ్బాయిని ముగ్గురు అమ్మాయిలు ప్రేమిస్తే ఎలా ఉంటుందన్నది ఈ సిరీస్‌ కథ. ఐదు ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ సెప్టెంబర్‌ 29 నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ వారం ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • ద డెవిల్స్‌ ప్లాన్‌ (కొరియన్‌ సిరీస్‌) సెప్టెంబరు 26
  • కాసిల్వేనియా (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 28
  • ఐస్‌కోల్డ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 28
  • లవ్‌ ఈజ్‌ ఇన్‌ ది ఎయిర్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 28
  • చూనా (హిందీ సిరీస్‌) సెప్టెంబరు 29
  • రెపెటైల్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 29
  • డు నాట్‌ డిస్ట్రబ్‌ (టర్కిష్‌) సెప్టెంబరు 29
  • పవర్‌ రేంజర్స్‌ కాస్మిక్‌ ఫ్యూరీ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 29
  • స్పైడర్‌ మ్యాన్‌ ఎక్రాస్‌ ది స్పైడర్‌ వెర్స్‌ (ఇంగ్లీష్‌) అక్టోబరు 1
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • ద ఫేక్‌ షేక్‌ (వెబ్‌సిరీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది
  • హాస్టల్ డేజ్‌: సీజన్‌4 (హిందీ) సెప్టెంబరు 27
  • జెన్‌ వి (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 29
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • ది వరస్ట్‌ ఆఫ్‌ ఈవిల్‌ (కొరియన్‌) సెప్టెంబరు 27
  • లాంచ్‌పాడ్‌ (వెబ్‌సిరిస్‌2) సెప్టెంబరు 29
  • తుమ్‌ సే నహీ పాయేగా (హిందీ) సెప్టెంబరు 29
  • సోనీలివ్‌
  • అదియా (తమిళ్‌) సెప్టెంబరు 29
  • బుక్‌ మై షో
  • బ్లూ బీటిల్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 29
  • లయన్‌ గేట్‌ ప్లే
  • సింపథీ ఫర్‌ ది డెవిల్‌(హాలీవుడ్) సెప్టెంబరు 29
  • హైరిచ్‌
  • ఎన్నివర్‌ (మలయాళం) సెప్టెంబరు 29
  • క్రాంతి వీర (కన్నడ) సెప్టెంబరు 29
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని