OTT Movies: ఈ వారం ఓటీటీలో రానున్న చిత్రాలు/వెబ్ సిరీస్‌లివే..!
ఈ వారం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అలరించే ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే
ఇప్పటికే విడుదలై సందడి చేసిన పలు చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవగా, ఆసక్తికర వెబ్‌సిరీస్‌లు సైతం వస్తున్నాయి. మరి, ఈ వారంలో ఓటీటీ వేదికగా అలరించనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏమిటంటే..!
యశోద
అగ్రకథానాయిక సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యశోద’ (Yashoda). డిసెంబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. సరోగసి నేపథ్యంలో సాగే మెడికల్ మాఫియా కథ ఇది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యశోద.. ఆర్థిక అవసరాల రీత్యా సరోగసి పద్ధతిలో బిడ్డకి జన్మనివ్వడం కోసం డా.మధు (వరలక్ష్మి శరత్‌కుమార్)కి చెందిన ఆస్పత్రిలో చేరుతుంది. మరి, అక్కడ ఆమెకు ఎదురైన సంఘటనలు ఏమిటి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. హరి - హరీష్ దీన్ని తెరకెక్కించారు.
మాచర్ల నియోజకవర్గం
నితిన్ (Nithiin) నటించిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). డిసెంబర్ 9న ‘జీ 5’ వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ అందుకున్న కథానాయకుడు రాక్షస రాజ్యాన్ని తలపించే మాచర్ల నియోజకవర్గ రూపురేఖలను ఎలా మార్చాడు? అన్న కథాంశంతో నూతన దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించారు. నితిన్ సరసన కృతిశెట్టి, కేథరిన్ నటించారు.
ఊర్వశివో రాక్షసివో..!
అల్లు శిరీశ్ (Allu Sirish) - అను ఇమ్మాన్యుయేల్ నటించిన రీసెంట్ హిట్ మూవీ ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo). డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’ వేదికగా ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. సహజీవనం నేపథ్యంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. రాకేశ్ శశి దర్శకుడు.
లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్..!
యువ నటుడు సంతోష్ శోభన్ (Santosh Sobhan) నటించిన సరికొత్త చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ (Like Share And Subscribe). ఫరియా కథానాయిక. మేర్లపాక గాంధీ దర్శకుడు. వీడియో షూట్ కోసం అడవులకు వెళ్లిన విప్లవ్ (సంతోష్ శోభన్), వసుధ (ఫరియా) పీపుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (పీపీఎఫ్) అనే ఓ నక్సల్ దళం చేతుల్లో చిక్కుతారు. వీరికి, నక్సల్స్‌కు ఉన్న సంబంధం ఏంటి? వాళ్లు వసుధ తండ్రిని ఎందుకు చంపాలనుకుంటుంటారు? వారి నుంచి విప్లవ్, వసుధ ఎలా తప్పించుకున్నారు? అనే ఆసక్తికర అంశాలతో ఇది తెరకెక్కింది. ఈ నెల 9 నుంచి సోనీ లివ్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.
ఈ వారం అలరించే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
* కాంతార (హిందీ) డిసెంబర్ 9
* క్యాట్ (హిందీ సిరీస్) డిసెంబర్ 9
* మనీ హెయిస్ట్ (కొరియన్ సిరీస్) డిసెంబర్ 9
* డ్రాగన్ ఏజ్ (ఇంగ్లీష్ సిరీస్) డిసెంబర్ 9
* డ్రీమ్ హోమ్ మేక్ ఓవర్ (ఇంగ్లీష్ సిరీస్) డిసెంబర్ 9
* డాక్టర్ జీ (హిందీ) డిసెంబర్ 11
జీ 5
* మాన్సూన్ రాగా (కన్నడ) డిసెంబర్ 9
* కాఫీ విత్ కాదల్ (తమిళం) డిసెంబర్ 9
* బ్లర్ (హిందీ) డిసెంబర్ 9
* మినీ (బెంగాలీ) డిసెంబర్ 9
ఆహా
* రథ సాచి (తమిళం) డిసెంబర్ 9
సోనీ లివ్
* విట్‌నెస్ (తమిళం) డిసెంబర్ 9
* రాయ్ (మలయాళం) డిసెంబర్ 9
* ఫాదు (హిందీ సిరీస్) డిసెంబర్ 9
హాట్‌స్టార్
* ఫాల్ (సిరీస్) డిసెంబర్ 9
* కనెక్ట్ (కొరియన్ సిరీస్) (విడుదలైంది)
* నైట్ ఎట్ ది మ్యూజియమ్ (ఇంగ్లీష్ సినిమా) డిసెంబర్ 9
* వీకెండ్ ఫ్యామిలీ (ఇంగ్లీష్ సిరీస్) డిసెంబర్ 9
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
చైనా చొరబాటుపై అమెరికా ముందే చెప్పిందా..? శ్వేతసౌధం స్పందన ఇదే..!
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
-
Politics News
రాహుల్.. నేటి కాలపు మీర్ జాఫర్!.. భాజపా నేత సంబిత్ పాత్ర విమర్శ
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Ts-top-news News
తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి