Prabhas: ప్రభాస్-మారుతీ మూవీ ఆ ముగ్గురు హీరోయిన్స్ ఫిక్స్!
ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తుండగా, ఇప్పుడు ఈ చిత్రంలోకి మరో కొత్త కథానాయిక వచ్చి చేరింది.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హారర్ కామెడీ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ కూడా మొదలైంది. ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తుండగా, ఇప్పుడు ఈ చిత్రంలోకి మరో కొత్త కథానాయిక వచ్చి చేరింది. రిద్ది కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’లో రిద్ది నటించింది. రైలు ప్రమాదంలో చేయి కోల్పోయిన వ్యక్తిగా ఆమె కనిపించారు.
అంతేకాదు, ఈ సినిమా గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. తాత, మనవడు ఇద్దరి పాత్రల్లోనూ ప్రభాస్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ పేరు ప్రచారంలో ఉంది. పాత థియేటర్‌లో దాచిన నిధిని వెలికితేసే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టాలీవుడ్ టాక్. అయితే, దీనిపై ఇప్పటివరకూ చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇంతకుముందెన్నడూ చూడని కథా,కథనాలతో ‘రాజా డీలక్స్’ ఉంటుందని సినిమాకు పనిచేస్తున్న వారు చెబుతున్నారు. ఇక వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది
ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు ‘ఆది పురుష్’ వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతున్నాయి. దీంతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్-కె’ కూడా నడుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Jayasudha: ఆ భయంతోనే అజిత్ సినిమాలో నటించలేదు: జయసుధ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chintakayala Vijay: సీఐడీ విచారణకు హాజరైన తెదేపా నేత చింతకాయల విజయ్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ..!
-
General News
TS High Court: గవర్నర్ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య
-
Movies News
Kailash Kher: సింగర్ కైలాశ్ ఖేర్‌పై వాటర్ బాటిళ్లతో దాడి..