Published : 21 Dec 2021 14:55 IST

KGF: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-1’.. సంచలనానికి మూడేళ్లు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ హీరో యశ్‌ నటించిన చిత్రం ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి పార్ట్‌ ‘కేజీఎఫ్‌- చాప్టర్‌ 1’ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. 2018లో ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా భారీ విజయాన్ని సాధించింది. ‘కేజీఎఫ్‌- చాప్టర్‌ 1’ విడుదలై నేటికి మూడేళ్లయిన నేపథ్యంలో చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. 

ఈ వీడియోలో ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-1’ విడుదల తేదీ ప్రకటన దగ్గర నుంచి ‘కేజీఎఫ్‌- చాప్టర్‌2’ విడుదల తేదీ ప్రకటన వరకు చిత్రబృందం చేసిన ప్రయాణాన్ని చూపించారు. అంతేకాదు.. థియేటర్లలో సందడి, చిత్రీకరణ, చిత్రంపై ప్రముఖుల అభిప్రాయం, ప్రేక్షకుల స్పందనలను వీడియో ద్వారా మరోసారి గుర్తు చేశారు. ‘‘ఇప్పటికీ మన చుట్టూ ఈలలు, అరుపులు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తమ చిత్రంగా ఆదరించిన అభిమానులందరికీ రుణపడి ఉంటాం. ఈ అభిమానమే ‘కేజీఎఫ్‌- చాప్టర్‌ 2’ను తెరకెక్కించడానికి ఇంధనంగా మారింది’’అని చిత్రబృందం పేర్కొంది. ‘కేజీఎఫ్‌- చాప్టర్‌ 2’ని ఏప్రిల్‌ 14, 2022న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఇటీవల ప్రకటించింది. సంజయ్‌దత్‌,  రవీనాటాండన్‌, రావూ రమేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం రవి బస్‌రుర్‌ కాగా, ఛాయాగ్రహణం భువన్‌ గౌడ.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని