Thunivu: ఓటీటీలో ‘తునివు’ వచ్చేస్తోంది.. రిలీజ్‌ ఎప్పుడు? ఎక్కడంటే..?

అజిత్ నటించిన రీసెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘తునివు’ (Thunivu). కోలీవుడ్‌లో విడుదలైన రోజే మంచి టాక్‌ను అందుకొన్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 03 Feb 2023 14:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టార్‌ హీరో అజిత్ (Ajith) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘తునివు’ (Thunivu). తెలుగులో ఇదే చిత్రం ‘తెగింపు’ పేరుతో విడుదలైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఫిబ్రవరి 8 నుంచి అన్ని భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

కథేంటంటే: పోలీస్ అధికారితో క‌లిసి ఓ ముఠా విశాఖ‌లోని యువ‌ర్ బ్యాంక్‌లో రూ.500 కోట్ల దోపిడీకి వ్యూహం ర‌చిస్తుంది. పక్కా ప్రణాళిక‌తో బ్యాంక్‌లోకి చొర‌బ‌డిన ముఠా వ్యూహాన్ని చిత్తు చేస్తూ అక్కడ డార్క్ డెవిల్ (అజిత్‌) ప్రత్యక్షం అవుతాడు. దొంగల ముఠాని పట్టుకునేందుకు పోలీస్ క‌మిష‌న‌ర్ (స‌ముద్రఖ‌ని) రంగంలోకి దిగుతాడు. మ‌రి డార్క్ డెవిల్ బ్యాంక్ దోపిడీ కోస‌మే వ‌చ్చాడా? బ్యాంక్‌లో ఉన్నది రూ.500 కోట్లే అన్న లెక్క‌.. ఆ త‌ర్వాత ఎలా మారింది? ఇంత‌కీ ఈ డార్క్ డెవిల్ ఎవ‌రు? అత‌డి ల‌క్ష్యం ఏమిట‌నే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు