Tiger 3: రౌడీలతో ఫైట్ చేస్తోన్న కత్రినా.. చూస్తే వావ్ అనాల్సిందే..!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, నటి కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘టైగర్ - 3’. ప్రముఖ దర్శకుడు మనీశ్ శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ ...
వీడియో షేర్ చేసిన సల్మాన్
ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, నటి కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘టైగర్ - 3’. ప్రముఖ దర్శకుడు మనీశ్ శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది సిద్ధమవుతోంది. ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందాహై’ సినిమాలకు కొనసాగింపుగా ఈ సినిమా రానుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ని తాజాగా చిత్రబృందం వెల్లడించింది. వచ్చే ఏడాది ఈద్‌కి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.
రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ సల్మాన్ షేర్ చేసిన ఓ స్పెషల్ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కత్రినాకైఫ్ ఫైట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు ఇందులో చూపించారు. తన శిక్షణ పూర్తైన వెంటనే కత్రినా అక్కడే బల్లపై నిద్రిస్తున్న సల్మాన్ వద్దకు చేరుకుని.. ‘‘ఇప్పుడు నీ వంతు.. సిద్ధంగా ఉన్నావా?’’ అని అడగ్గానే.. ‘‘టైగర్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది’’ అని ఆయన చెప్పే డైలాగ్‌లు పవర్‌ఫుల్‌గా అనిపించాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ