
Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు కోసం రూ.7కోట్ల భారీ సెట్?
హైదరాబాద్: రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇటీవల సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం చిత్ర బృందం రూ.7కోట్ల భారీ సెట్‌ను నిర్మిస్తోందట. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల సారథ్యంలో ఈ సెట్ తీర్చిదిద్దుతున్నారట. అవినాష్ గతంలో ‘మహానటి’, ‘జెర్సీ’, ‘ఎవరు’, ‘శ్యామ్ సింగరాయ్’తదితర చిత్రాలకు పనిచేశారు. ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ కోసం స్టువర్టుపురం ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నారు. శంషాబాద్ సమీపంలో 5 ఎకరాల స్థలంలో ఈ సెట్‌ను రూపొందిస్తున్నారు.
ఇక సినిమా కోసం రవితేజ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. ఆయన డిక్షన్, డైలాగ్ డెలవరీ, గెటప్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని టాక్. మునుపెన్నడూ రవితేజ ఇలాంటి పాత్ర చేయలేదు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
-
Ap-top-news News
Andhra News: 10.30కి వివాదం.. 8 గంటలకే కేసు!
-
Ap-top-news News
Margani Bharat Ram: ఎంపీ సెల్‌ఫోన్ మిస్సింగ్‌పై వివాదం
-
Ap-top-news News
Andhra News: ప్రభుత్వ బడిలో ఐఏఎస్ పిల్లలు
-
Ts-top-news News
Heavy Rains: నేడు, రేపు అతి భారీ వర్షాలు
-
Ap-top-news News
Dadisetti Raja: నచ్చకపోతే వాలంటీర్లను తీసేయండి: మంత్రి రాజా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- రూ.19 వేల కోట్ల కోత
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా