Cinema news: కల్యాణ్‌రామ్ ట్రిపుల్ రోల్.. ‘కేజీయఫ్’ మేకర్స్ కొత్త మూవీ
సినీ పరిశ్రమలో సోమవారం సినిమాలకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌లు వచ్చాయి. కొత్త సినిమాలు, టీజర్, లిరికల్ వీడియోలకు సంబంధించిన వివరాలను ఆయా చిత్ర బృందాలు పంచుకున్నాయి..
కల్యాణ్‌రామ్ ట్రిపుల్‌రోల్
‘బింబిసార’ విజయంతో జోరుమీదున్నారు నటుడు కల్యాణ్‌రామ్. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌కు సంబంధించిన పనులు జరుగుతుండగా, ఈలోగా మరో చిత్రాన్ని పూర్తి చేసేపనిలో పడ్డారు. ఆయన ట్రిపుల్‌రోల్‌లో నటిస్తున్న కొత్త చిత్రం ‘అమిగోస్’. ఇందులో కల్యాణ్‌రామ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అనుష్క మూవీ అప్‌డేట్
అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఆమె కొత్త చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. నవీన్ పొలిశెట్టితో కలిసి ఆమె ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె అన్విత రవళిశెట్టి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు, ఆమె చెఫ్‌గా కనిపించారు.
హనుమాన్ టీజర్ వచ్చేస్తోంది!
తేజ సజ్జా కీలక పాత్రలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ టీజర్ నవంబరు 15న విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘హనుమాన్’ విడుదల కానుంది.
‘హిట్2’ నుంచి వీడియో సాంగ్..
క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’కు కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘హిట్2’. అడవిశేష్ కథానాయకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ‘ఉరికే.. ఉరికే’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను నవంబరు 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
‘కేజీయఫ్’ నిర్మాతల నుంచి మరో చిత్రం
‘కేజీయఫ్’, ‘కాంతార’ వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించింది హోంబాలే ఫిల్మ్. ఆ బ్యానర్‌పై మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ‘పుష్ప’లో జాలిరెడ్డిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ధనుంజయ హీరోగా ‘ఉత్తరకాండ’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రోహిత్ పడకి దర్శకుడు. కన్నడ నటి రమ్య కీలక పాత్రలో కనిపించనున్నారు. కార్తీక్ గౌడ, యోగిరాజ్‌లతో కలిసి విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు