BA Raju: నిర్మాత బీఏ రాజు కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, పీఆర్వో బి.ఏ. రాజు కన్నుమూశారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని శుక్రవారం రాత్రి తన నివాసంలో గుండెపోటుత.....

Updated : 22 May 2021 06:43 IST

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు (62) కన్నుమూశారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయన గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు శివకుమార్‌ తెలిపారు. 1500కు పైగా సినిమాలకు పీఆర్వోగా చేయడంతోపాటు తన భార్య బి.జయ దర్శకత్వం వహించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చాన్నాళ్లపాటు ‘సూపర్‌హిట్‌’ అనే సినీ పత్రికను నడిపారు. బీఏ రాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య జయ 2018లో కన్నుమూశారు. రాజు హఠాన్మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని