Kadambari Kiran: నటుడు కాదంబరి కిరణ్‌ కుమార్తె వివాహం.. హాజరైన సినీ తారలు

టాలీవుడ్‌ నటుడు కాదంబరి కిరణ్‌ (Kadambari Kiran) నివాసంలో పెళ్లి వేడుక జరిగింది. ఆయన కుమార్తె పూర్ణ సాయి శ్రీ వివాహం బుధవారం సాయంత్రం వేడుకగా జరిగింది.

Updated : 02 Feb 2023 10:32 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌(Tollywood)లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో హాస్య నటుడిగా నటించి తెలుగువారిని కడుపుబ్బా నవ్వించారు కాదంబరి కిరణ్‌ (Kadambari Kiran). బుధవారం ఆయన కుమార్తె పూర్ణ సాయి శ్రీ వివాహం వేడుకగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఈ పెళ్లి కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తోపాటు టాలీవుడ్‌ ప్రముఖులు శ్రీకాంత్‌, ఆలీ, కోటా శ్రీనివాసరావు, కౌసల్య తదితరులు పాల్గొన్నారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. టెలివిజన్‌ ఆర్టిస్టగా కెరీర్‌ మొదలుపెట్టిన కాదంబరి కిరణ్‌.. సినిమాల్లోనూ రాణించారు. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘మహారథి’, ‘కెవ్వుకేక’, ‘దరువు’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘రంగస్థలం’, ‘భీమ్లానాయక్‌’, ‘రంగ్‌దే’, ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ వంటి చిత్రాల్లో ఆయన హాస్యనటుడు, సహాయనటుడిగా నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు