Adipurush: సూర్యనారాయణ నుంచి ప్రభాస్ వరకు.. ‘జైశ్రీరామ్’ అనిపించిన నటులు
‘ఆదిపురుష్’ సినిమాలో రాముడి పాత్ర పోషించి, అందరి దృష్టిని ఆకర్షించారు ప్రభాస్. ఈయనకు ముందు ఎవరెవరు? ఏయే చిత్రాల్లో రామ అవతారంలో కనిపించారంటే..
ఇంటర్నెట్ డెస్క్: రాముడిగా ప్రభాస్ (Prabhas) ఎలా ఉంటాడు? ఎలాంటి సంభాషణలు చెబుతాడు?.. ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా ప్రకటన వెలువడగానే సినీ అభిమానుల్లో ఉత్పన్నమైన సందేహాలివి. ఆదివారం విడుదలైన టీజర్ అన్ని ప్రశ్నలకు చెక్ పెట్టింది. ప్రభాస్ ఆహార్యం, మాటలకు భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఫిదా అయింది. రామ నామం జపిస్తోంది. మరి, ప్రభాస్ కంటే ముందు రాముడిగా ఎవరెవరు కనిపించారో చూద్దాం..
రాముడి పాత్రకు ఆద్యుడు
తెలుగు సినిమా మాటలు నేర్చుకుంటున్న దశ (టాకీ)లో పౌరాణిక కథలనే ఎక్కువగా తెరపైకి తీసుకొచ్చారు. అలా తొలిసారి రామాయణం ఆధారంగా చేసుకుని రూపొందిన తెలుగు చిత్రం ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. ఇందులో యడవల్లి సూర్యనారాయణ (Yadavally Suryanarayana) రాముడిగా నటించారు. శ్రీరాముడి పాత్రను పోషించిన తొలి నటుడు కాబట్టి సూర్యనారాయణను ‘తెలుగు టాకీ తొలి రాముడు’ అని పిలిచేవారు. బాదామి సర్వోత్తమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1932లో విడుదలైంది.
రాముడిగానే పరిచయం..
అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswararao) ‘ధర్మపత్ని’ అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. అందులో ఆయనది సహాయ నటుడి పాత్ర. కథానాయకుడిగా ఏఎన్నార్ నటించిన తొలి సినిమా ‘సీతా రామ జననం’ (1944). హీరోగా తొలి ప్రయత్నంలోనే రాముడి పాత్రను ఎంపిక చేసుకుని, తనకు తానే సాటి అని నిరూపించారు. ఘంటసాల బలరామయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు.
రాముడికి ప్రతిరూపం..
‘ఈయనే రాముడు’ అని అనిపించేంతగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు నందమూరి తారకరామారావు. రాముడిగా అత్యధిక సినిమాల్లో కనిపించిన నటుడిగా నిలిచారు. కె. సోము దర్శకత్వంలో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’ (1959), సి. పుల్లయ్య తెరకెక్కించిన ‘లవకుశ’ (1963), చిత్తూరు వి. నాగయ్య దర్శకత్వంలో వచ్చిన ‘రామదాసు’ (1964), బాపు డైరెక్ట్ చేసిన ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ (1975), స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీరామ పట్టాభిషేకం’(1978) చిత్రాల్లో ఎన్టీఆర్ రామ చరితను వివరించారు.
సీతారామ కల్యాణంతో..
శ్రీరామ పాత్ర పోషించిన అలనాటి నటుల్లో హరనాథ్ ఒకరు. నందమూరి తారక రామారావు దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామ కల్యాణం’ (1961) సినిమా కోసం తొలిసారి ఆయన శ్రీరాముడిగా మారారు. ఆ తర్వాత ‘శ్రీరామ కథ’ (1969)లో రాముడిగా కనిపించారు.
శోభన్ బాబు ఇలా..
మహిళా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న నాటి నటుడు శోభన్‌బాబు. ఆయనా రాముడిగా నటించి ప్రేక్షకాదరణ పొందారు. బాపు దర్శకత్వం వహించిన ‘సంపూర్ణ రామాయణము’ (1972) చిత్రంలో శోభన్ బాబు శ్రీరాముడిగా కనిపించారు.
కాంతారావు..
కాంతారావు.. ‘వీరాంజనేయ’ (1968), రవికుమార్.. ‘సీతా కల్యాణం’ (1976) సినిమాల్లో రాముడిగా ఒదిగిపోయారు.
చిన్నప్పుడే రాముడి పాత్రలో నటించి, మెప్పించారు జూనియర్ ఎన్టీఆర్. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాల రామాయణం’తో ఎన్టీఆర్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది ‘బాల రామాయణం’.
‘దేవుళ్లు’ సినిమాలోని ‘అందరి బంధువయా’ పాటలో రాముడిగా కనిపిస్తారు శ్రీకాంత్. ఆ పాత్రకు సంబంధించిన నిడివి సెకన్లే అయినా మంచి ప్రభావం చూపింది.
నాగార్జున హీరోగా దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన భక్తిరస చిత్రాల్లో ‘శ్రీరామదాసు’ ఒకటి. అందులో నాగార్జున రామదాసుగా నటించగా శ్రీరాముడిగా సుమన్ నటించారు.
‘శ్రీరామాంజనేయ యుద్ధం’లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)ను రాముడిగా చూపించిన దర్శకుడు బాపు.. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణనూ రాముడి పాత్రలో ఒదిగిపోయేలా చేశారు. బాపు- బాలకృష్ణల కాంబినేషన్లో వచ్చిన ఆ దృశ్యకావ్యమే ‘శ్రీరామరాజ్యం’.
* ‘ఆదిపురుష్’.. వీటన్నింటికీ భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. విజువల్ వండర్‌గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రం 2023 జనవరి 12న విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!
రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం.. -
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది?
తాజా వార్తలు (Latest News)
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్‌నవూ సెంచరీ హీరో
-
భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా