Tollywood: ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి సందడి.. తరలివచ్చిన తారాలోకం

ప్రముఖ నిర్మాత సునీల్‌ నారంగ్‌(Sunil Narang) కుమార్తె జాన్వి వివాహం గురువారం రాత్రి హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. కుటుంబసభ్యుల సమక్షంలో ఆదిత్యతో ఆమె ఏడడుగులు వేశారు. ఘనంగా జరిగిన...

Updated : 24 Jun 2022 11:13 IST

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత సునీల్‌ నారంగ్‌(Sunil Narang) కుమార్తె జాన్వి వివాహం గురువారం రాత్రి హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఆదిత్యతో ఆమె ఏడడుగులు వేశారు. ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో పలువురు రాజకీయ నాయకులు, టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సందడి చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, హరీశ్‌ రావు, అగ్రకథానాయకులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, నాగార్జున, దర్శకులు హరీశ్‌ శంకర్‌, బోయపాటి శ్రీను, ప్రశాంత్‌ వర్మ, అనుదీప్, శేఖర్‌ కమ్ముల, నిర్మాతలు అభిషేక్‌ అగర్వాల్‌, సి.కల్యాణ్‌, నాగవంశీ, సురేశ్‌ బాబు, మిర్యాల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఇక, ఈ వేడుకల్లో మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదిక వద్దకు వీరిద్దరూ కలిసి వచ్చారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు అంతటా చక్కర్లు కొడుతున్నాయి. సునీల్‌ నారంగ్‌కు చెందిన శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై ఇటీవల విడుదలైన ‘లవ్‌ స్టోరీ’ సూపర్‌ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్‌పై రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు సిద్ధమవుతున్నాయి. వాటిల్లో ఒకటి శేఖర్‌కమ్ముల-ధనుష్‌ కాంబోలో రానుంది. మరొకటి శివకార్తికేయన్‌-అనుదీప్‌ కాంబోలో సిద్ధమవుతోన్న ‘ప్రిన్స్’‌.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని