Brahmanandam: వేడుకగా బ్రహ్మానందం రెండో కుమారుడి నిశ్చితార్థం.. హాజరైన సినీ ప్రముఖులు

హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam) రెండో కుమారుడి నిశ్చితార్థం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది.

Published : 22 May 2023 13:14 IST

హైదరాబాద్‌: ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam) రెండో కుమారుడు సిద్దార్థ్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. నగరానికి చెందిన డాక్టర్‌ పద్మజా వినయ్‌ కుమార్తె, డాక్టర్‌.ఐశ్వర్యను ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులతోపాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. పలువురు నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గౌతమ్‌ పలు సినిమాల్లో నటించారు. రెండో తనయుడు సిద్దార్థ్‌.. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే ఉద్యోగం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని