‘భూదాన్‌ ఉద్యమం’పై నీలకంఠ సినిమా

 ‘భూదాన్‌ ఉద్యమం’పై నీలకంఠ సినిమా

Published : 11 Sep 2021 23:00 IST


పేదరికంలో మగ్గిపోతున్న దేశప్రజలకు భూములను పంచిపెట్టిన భూదానోద్యమం ఎందరో జీవితాల్లో వెలుగులు తెచ్చింది. ఈ ఉద్యమంలో భాగంగా ఆచార్య వినోబాభావే అడిగిన వెంటనే 100 ఎకరాల భూమిని  దానం చేసేందుకు ముందుకొచ్చారు వెదిరె రామచంద్రరాడ్డి. అలా ఒక్క రక్తపు బొట్టు చిందంచకుండా 58  లక్షల ఎకరాలను నిరుపేదలకు చేరేందుకు స్ఫూర్తినిచ్చిన దాత రామచంద్రారెడ్డి. ఆయన జీవితంపై ఇప్పుడొక సినిమా తెరకెక్కబోతోంది.  దీన్ని ప్రముఖ టాలీవుడ్‌ డైరెక్టర్‌ నీలకంఠ తెరకెక్కించనున్నారు. రామచంద్రరెడ్డి మనవడు చంద్రశేఖర్‌ రెడ్డి సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ..‘దేశంలోనే మొదటి భూదాతగా నిలిచిన వ్యక్తి జీవితాన్ని సినిమాగా చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. ఇది కమర్షియల్‌ సినిమా కాదు, అలాగని డాక్యుమెంటరీగా మలచలేము. చాలా జాగ్రత్తగా తెరకెక్కించాల్సిన సినిమా. ఈ చిత్రం కోసం శాయశక్తులా కృషి చేస్తాను’ అన్నారు. శనివారం వినోబాభావే 127వ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో  దర్శకుడు నీలకంఠ, నిర్మాత చంద్ర శేఖర్ రెడ్డి, చిత్ర సమర్పకులు అరవింద్ రెడ్డి, ప్రమోద్ చంద్ర రెడ్డి, మహాదేవ్ విద్రోహి, సహా నిర్మాతలు గడ్డం రవి, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని