Nagarjuna: దూసుకొచ్చిన అభిమాని.. క్షమాపణలు చెప్పిన నాగార్జున

ప్రముఖ టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున ఓ అభిమానికి క్షమాపణలు తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లో తనకు ఎదురైన ఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.   

Updated : 24 Jun 2024 00:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అభిమాన హీరోలతో ఒక్కసారైనా మాట్లాడాలని, ఫొటో దిగాలని అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. అనుకోని సందర్భాల్లో తారస పడితే అభిమానుల ఆనందానికి అవధులుండవు. అదే క్షణంలో వారిని కలిసేందుకు భద్రతను సైతం లెక్కచేయకుండా సాహసాలు చేస్తుంటారు. కొన్నిసార్లు అభిమానుల ఉత్సాహాన్ని చూసి సెలబ్రిటీలే దగ్గరికి వెళ్లి మరీ సెల్ఫీలు దిగుతుంటారు. కొన్నిసార్లు మాత్రం సెక్యూరిటీ సిబ్బంది చేతిలో అభిమానులకు భంగపాటు తప్పదు. ఇలాంటివన్నీ ఎక్కువగా ప్రయాణాల్లోనే జరుగుతుంటాయి. తాజాగా అగ్రహీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) విషయంలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. దీంతో ఆయన ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తున్న నాగార్జునను చూసిన ఓ అభిమాని కలిసేందుకు ముందుకు దూసుకువచ్చాడు. అయితే క్షణాల్లో తేరుకున్న సిబ్బంది ఒకరు సదరు వ్యక్తిని పక్కకు లాగేశాడు. ఆ సమయంలో ఈ విషయం నాగార్జున దృష్టికి వచ్చినట్లు వీడియోలో కనిపించలేదు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశాడు. దీంతో నాగార్జున స్పందించారు. ‘‘ఈ ఘటన నా దృష్టికి వచ్చింది. ఇలాంటిది జరిగి ఉండాల్సింది కాదు. సదరు వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటాను’’ అని పోస్టు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని