Social Look: సీతాకోకచిలుకలా కృతిసనన్‌.. కోమలి ‘నిప్పు, నీరు’ క్యాప్షన్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 31 Jan 2023 01:17 IST

* కోమలి ప్రసాద్‌ తన ఫొటోలు పంచుకున్నారు. ‘నీరు లేదా నిప్పు’ ఏది క్యాప్షన్‌ పెడతారు అని అభిమానుల్ని అడిగారు.

* బ్లూ కలర్‌ డ్రెస్సులో హొయలొలికించింది కృతిసనన్‌. వాటిని షేర్‌ చేస్తూ ‘బ్లూ బటర్‌ఫ్లై’ అని క్యాప్షన్‌ పెట్టింది.

* శ్రియ.. ‘స్టార్‌డస్ట్‌’ అవార్డు అందుకున్నారు. సంబంధిత వేడుక ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ, తనను అందంగా రెడీగా చేసిన టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

* ఐశ్వర్య మేనన్‌ తన స్టిల్‌ పోస్ట్‌ చేస్తూ.. ‘నేను క్యూట్‌గా ఉన్నానని అనుకుంటున్నా’ అని సరదాగా పేర్కొన్నారు.

* నభానటేశ్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అందులో ఆమె తెలుపు రంగు చీరలో, తెలుపు రంగు గులాబీలు పట్టుకుని కనిపించారు.

* ఓ కార్యక్రమంలో పాల్గొన్న సదా సంబంధిత ఫొటోలు పంచుకుంటూ ‘సోలో’ అనే హ్యాష్‌ట్యాగ్‌ జతచేశారు. పెర్ఫామెన్స్‌ ఇచ్చేందుకు తనకు జోడీగా ఎవరూ లేరనే ఉద్దేశంలో!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు