Tollywood: నవ్వులు పంచే ‘క్రేజీ ఫెలో’
‘‘పులితో పరుగు పందెం.. నాతో మందు పందెం వేయకూడదు’’ అంటున్నారు ఆది సాయికుమార్. ఆయన హీరోగా ఫణికృష్ణ సిరికి తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్రేజీ ఫెలో’. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. దిగంగన సూర్యవంశి, మర్నా మేనన్ కథానాయికలు. ఈ సినిమా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది
‘‘పులితో పరుగు పందెం.. నాతో మందు పందెం వేయకూడదు’’ అంటున్నారు ఆది సాయికుమార్ (Aadi). ఆయన హీరోగా ఫణికృష్ణ సిరికి తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్రేజీ ఫెలో’ (Crazy Fellow). కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. దిగంగన సూర్యవంశి, మర్నా మేనన్ కథానాయికలు. ఈ సినిమా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం చిత్ర టీజర్ విడుదల చేశారు. ‘‘టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమాలో ఆది పాత్ర చాలా క్రేజీగా ఉంటుంది. అతను చేసే పనులు తనకు కావాల్సిన వారికి ఇబ్బందులు కలిగిస్తుంటాయి. ఇలాంటి వ్యక్తి జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? అన్నది మిగతా కథ’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్, కూర్పు: సత్య గిడుతూరి, ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల.
నవంబర్‌లో ‘బనారస్’
జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో జంటగా జయతీర్థ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘బనారస్’ (Banaras). తిలకరాజ్ బల్లాల్ నిర్మాత. సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబర్ 4న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ‘‘బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రమిది. జైద్, సోనాల్ జోడీ అందరినీ ఆకట్టుకుంటుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి.
గౌరవం పెంచే ‘అల్లూరి’
‘‘ఓ పోలీస్ జీవిత ప్రయాణమే.. ‘అల్లూరి’ (Alluri). సినిమా పూర్తయ్యే సరికి ప్రతి ఒక్కరికీ పోలీస్ వృత్తిపై ఎనలేని గౌరవం ఏర్పడుతుంది’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ఆయన నిర్మాణంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందిస్తున్న చిత్రమే ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకుడు. బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘మంచి కంటెంట్‌తో యాక్షన్ సినిమా తీయాలని కోరిక ఉండేది. అలాంటి సమయంలోనే దర్శకుడు ప్రదీప్ ఈ కథ చెప్పాడు. అల్లూరి పేరు వింటేనే ఓ పవర్ వస్తుంది. అంత పవర్ఫుల్ స్టోరీ ఇందులో ఉంది. శ్రీవిష్ణు చాలా కష్టపడ్డాడు. దీంట్లో ఆయన విశ్వరూపం చూస్తారు. ప్రదీప్ దీన్ని చాలా గొప్పగా తీశాడు. హర్ష వర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాపై ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఇలా పోలీస్ డ్రెస్‌లో మీ ముందుకొచ్చా. సెప్టెంబర్ 3న వైజాగ్‌లోని అల్లూరి సీతారామరాజు సమాధి దగ్గర నుంచి చిత్ర బృందంతో కలిసి యాత్ర ప్రారంభిస్తున్నాం. 12రోజుల పాటు సాగే ఈ యాత్ర నిజామాబాద్‌లో ముగుస్తుంది. రేపటి నుంచి పాటలు విడుదల చేస్తాం. పది రోజుల తర్వాత ట్రైలర్ విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కూర్పు: ధర్మేంద్ర కాకరాల, ఛాయాగ్రహణం: రాజ్ తోట.
‘నేచర్’.. ప్రేమకథ
ప్రకృతిని ఇష్టపడే కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఆ ప్రేమ వల్ల అతను ఎన్ని కష్టాలు పడ్డాడు? చివరకు ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు? తెలియాలంటే ‘నేచర్’ (Nature) చూడాల్సిందే. కృష్ట, ముస్కాన్ రాజేందర్ జంటగా అశ్విన్ కామరాజు కొప్పల తెరకెక్కిస్తున్న చిత్రమిది. సి.యశోదమ్మ, టి.చేతన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజయ్ ఘోష్, గౌతమ్‌రాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని ‘‘నిన్నే చూడందే’’ పాటను నటుడు అలీ ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టైటిల్ చాలా బాగుంది. ప్రకృతి బాగుంటే మనమంతా బాగుంటాం. ఈ పాట వింటుంటే నాకు ఇళయరాజా గీతాలు గుర్తొస్తున్నాయి’’ అన్నారు. ‘‘ప్రకృతిని ఇష్టపడే కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందిస్తున్నాం’’ అన్నారు చిత్ర దర్శకుడు అశ్విన్ కామరాజు. ఈ కార్యక్రమంలో యం.యల్.రాజా, కృష్ణుడు, కాశీ విశ్వనాథ్, సుధాకర్ తుపాకుల, రవి చల్ల తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్‌ల పరిణయం
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!