Tollywood: వరుస అప్‌డేట్స్.. సందడే సందడి
మాస్ మహారాజ్ రవితేజ తన సక్సెస్ సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. అలాగే కోలీవుడ్ నటుడు సూర్య సైతం హిట్ చిత్రంతో మరోమారు సూపర్‌హిట్ అందుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది...
హైదరాబాద్: రవితేజ తన సక్సెస్ సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. అలాగే కోలీవుడ్ నటుడు సూర్య సైతం హిట్ చిత్రంతో మరోమారు సూపర్‌హిట్ అందుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్‌వేవ్ కారణంగా కొంతకాలం నుంచి గాడి తప్పిన చిత్రపరిశ్రమలో ఇప్పుడు మళ్లీ పాత కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి వరుస సినిమా అప్‌డేట్‌లతో సినీ ప్రియులు సైతం పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం తాజాగా సూర్య, రవితేజ తమ సరికొత్త సినీ ప్లాన్స్ విశేషాలు వెల్లడించారు. ఇంతకీ వాళ్లిద్దరి ప్లాన్స్ ఏమిటో మీరూ చూసేయండి..!
సెంటిమెంట్ రిపీట్..!
వాస్తవిక ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘క్రాక్’ చిత్రంతో సూపర్‌హిట్ విజయాన్ని అందుకున్నారు రవితేజ. చాలా రోజుల తర్వాత సక్సెస్ రుచి చూశారు. ఈ క్రమంలోనే తన తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శరత్ మండవ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే పేరు ఖరారు చేశారు. ఈ సినిమా కూడా వాస్తవిక ఘటనలను ఆధారంగా చేసుకునే తెరకెక్కుతోంది. అలాగే, ‘క్రాక్’ చిత్రం మాదిరిగానే ఇందులో మన హీరోగారు ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది.
మరోసారి విమానం ఎక్కనున్న సూర్య..!
ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది ఓటీటీ వేదికగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కథను హిందీ ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. మాతృకను తెరకెక్కించిన సుధా కొంగర రీమేక్ బాధ్యతలు స్వీకరించారు. ఇందులో కథానాయకుడిగా ఎవరు నటిస్తారో చూడాలి.
సుధీర్‌బాబు మరో ప్రాజెక్ట్..!
హీరో సుధీర్‌బాబు ప్రాజెక్ట్‌ల విషయంలో స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాల్లో నటిస్తున్న ఆయన తాజాగా తన సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ దాస్, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకూ పోషించని పాత్రలో తాను ఈ చిత్రంలో కనిపించనున్నానని సుధీర్ తెలిపారు.
‘ఏజెంట్’ వచ్చేశాడు..!
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఏజెంట్’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. సోమవారం ఈ సినిమా షూట్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అఖిల్ లుక్ పోస్టర్‌ని చిత్రబృందం నెటిజన్లతో పంచుకుంది. ఇందులో అఖిల్.. మునుపెన్నడూ లేని విధంగా సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నారు.
రామ్19..
ఇస్మార్ట్ హీరో రామ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో ఓ సరికొత్త చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్‌కు జంటగా నటి కృతిశెట్టి సందడి చేయనున్నారు. తాజాగా ఈ సినిమా షూట్ నగరంలో ప్రారంభమైంది. యాక్షన్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
బడికెళ్లాలంటే.. ఈత రావాలి
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!
-
Asian Games: అన్న అక్కడ.. తమ్ముడు ఇక్కడ