Tollywood: 50 రోజుల తర్వాతే ఓటీటీకి

కొత్త సినిమాలు విడుదలైన రెండు మూడు వారాలకే ఓటీటీ వేదికల్లో దర్శనమిస్తుంటాయి. ఇది థియేటర్లపై పెను ప్రభావం చూపుతోంది. ప్రేక్షకులు థియేటర్లకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. అందుకే నిర్మాతలు దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాలు విడుదలైన యాభై రోజుల తర్వాతే ఓటీటీల్లో ప్రదర్శించేలా ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు.

Updated : 30 Jun 2022 08:09 IST

జులై 1 నుంచే వర్తింపు
నిర్మాతల కీలక నిర్ణయం

కొత్త సినిమాలు విడుదలైన రెండు మూడు వారాలకే ఓటీటీ (OTT) వేదికల్లో దర్శనమిస్తుంటాయి. ఇది థియేటర్లపై పెను ప్రభావం చూపుతోంది. ప్రేక్షకులు థియేటర్లకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. అందుకే నిర్మాతలు దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాలు విడుదలైన యాభై రోజుల తర్వాతే ఓటీటీల్లో ప్రదర్శించేలా ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు. జులై 1 నుంచి ఒప్పందాలు చేసుకునే సినిమాలన్నిటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. బుధవారం చలన చిత్ర వాణిజ్య మండలిలో నిర్మాతలు సమావేశమయ్యారు. టికెట్‌ ధరలు, డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడింగ్‌కి సంబంధించిన విషయాలు మొదలుకొని ఓటీటీ వరకు పలు విషయాల్ని చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని