Tollywood: ఈ వారం విడుదలైన సినిమాల రివ్యూలివే

వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాలు చూసేయండి.

Updated : 22 Oct 2022 11:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వీకెండ్‌ వచ్చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయం గడపడం కోసం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి కాదు రెండు ఏకంగా నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఈ వారం సినిమాహాళ్లలో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేమిటి? వాటి విశేషాలేమిటో ఓ లుక్కేయండి..!

స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటే లైఫ్‌ ఎలా ఉంటుంది?

స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది? వివాహబంధంలో వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి ఏం చేయాలి? అనే ఆసక్తికర అంశాలతో రూపుదిద్దుకున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఓరి దేవుడా..!’ (Ori Devuda). కోలీవుడ్‌లో విజయం అందుకున్న ‘ఓ మై కడవులే’కి రీమేక్‌గా ఇది సిద్ధమైంది. విశ్వక్‌ సేన్ (Vishwak Sen)‌, మిథిలా పాల్కర్‌ (Mithila Palkar) జంటగా నటించిన ఈ సినిమాలో వెంకటేశ్‌ (Venkatesh) అతిథి పాత్రలో అలరించారు. ఈ వీకెండ్‌లో ఇదొక పర్‌ఫెక్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.

ఓరి దేవుడా రివ్యూ 

‘సర్దార్‌’తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు..!

తెలుగువారికి సుపరిచితమైన కోలీవుడ్‌ నటుడు కార్తి (Karthi). ఆయన నటించిన సరికొత్త చిత్రం ‘సర్దార్‌’ (Sardar). యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కార్తి ద్విపాత్రాభినయం పోషించాడు. సైనిక రహస్యాలు ఉన్న ఓ ఫైల్‌ మాయం కావడం.. అది ఎక్కడ ఉందో కనిపెట్టేందుకు యువ పోలీస్‌ అధికారి విజయ్‌ ప్రకాశ్‌ (కార్తి) రంగంలోకి దిగడం.. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? విజయ్‌ ప్రకాశ్‌ తండ్రి సర్దార్‌ (కార్తి)పై దేశద్రోహి అనే ముద్ర పడటానికి కారణం ఏమిటి? ఇలాంటి ఆసక్తికర అంశాలతో సిద్ధమైన ఈ చిత్రం స్పై, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ప్రేమికులకు బాగా నచ్చుతుంది.

సర్దార్‌ రివ్యూ

‘జిన్నా’.. ఓ ఫన్‌ రైడ్..!

మంచు విష్ణు (Manchu Vishnu) - పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) - సన్నీలియోనీ (Sunny leone) ప్రధాన తారాగణంగా తెరకెక్కిన హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘జిన్నా’ (GINNA). ఈషాన్‌ సూర్య దర్శకుడు. ఊరంతా అప్పులు చేసిన జిన్నా (విష్ణు) వాటిని ఎలా తీర్చాడు? తాను ప్రేమించిన స్వాతిని పెళ్లి చేసుకున్నాడా? లేదా అప్పులు తీర్చేసి, సర్పంచ్‌ కావాలనే ఉద్దేశంతో రేణుక మెడలో తాళి కట్టాడా? వంటి అంశాలతో సిద్ధమైన ఈ సినిమా.. ప్రేక్షకులకు వీకెండ్‌లో మంచి ఫన్‌రైడ్‌.

జిన్నా రివ్యూ

‘ప్రిన్స్‌’పై ఓ లుక్కేయండి..!

‘జాతిరత్నాలు’ ఫేమ్‌ అనుదీప్‌ (Anudeep) తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘ప్రిన్స్‌’ (Prince). శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan) హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఉక్రెయిన్‌ భామ మరియా కథానాయిక. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆనంద్‌(శివకార్తికేయన్‌) ఏం చేశాడు? ఆమె తండ్రిని ఎలా ఒప్పించాడు? ప్రేమ పోరాటంలా కనిపించిన ఈ కథ రెండు దేశాల మధ్య పోరులా ఎలా మారింది? ఇలాంటి ఆసక్తికర అంశాల చుట్టూ సాగే ఈ సినిమా కుటుంబం మొత్తానికి కాలక్షేపాన్ని అందిస్తుంది.

ప్రిన్స్‌ రివ్యూ

ఓటీటీలో అమ్ము:

సమాజంలో కొంతమంది మహిళలు ఎదుర్కొంటోన్న గృహహింసను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘అమ్ము’ (Ammu). ఐశ్వర్య లక్ష్మి, నవీన్‌ చంద్ర (Naveen Chandra) ప్రధాన పాత్రల్లో నటించారు. మహిళల సంరక్షణ కోసం పనిచేయాల్సిన ఓ పోలీసు అధికారి (నవీన్‌ చంద్ర).. తన భార్యను ఎలా ఇబ్బందులు పెట్టాడు? అతడి బారి నుంచి ఆమె ఎలా విముక్తి పొందింది? అనే విషయాలను తెలియజేస్తూ ఈ సినిమా రూపుదిద్దుకుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఇది అందుబాటులో ఉంది.

అమ్ము రివ్యూ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని