Cinema News: తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపై నేడు సమావేశం.. హాజరుకానున్న ప్రముఖులు

తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపై రేపు చిత్ర పరిశ్రమలో సమీక్ష జరగనుంది. తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ఆధ్వర్యంలో ఫిల్మ్‌నగర్‌..

Updated : 19 Feb 2022 23:57 IST

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపై ఈ రోజు చిత్ర పరిశ్రమలో సమీక్ష జరగనుంది. తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ఆధ్వర్యంలో ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగే ఈ సమావేశానికి 24 శాఖలకు చెందిన సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. సినీ పరిశ్రమలో కరోనా కాలంలో ఎదురైన ఆటంకాలు, ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందుకోసం ఫిల్మ్‌ ఛాంబర్‌లోని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌, డిస్టిబ్యూటర్స్‌ అసోసియేషన్‌, స్టూడియో సెక్టార్‌, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌, ఫిల్మ్‌ ఫెడరేషన్‌, డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ సహా అన్ని సంఘాలను సమావేశానికి ఆహ్వానించారు. సుమారు 200 మందికిపైగా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరై సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. మా అధ్యక్షుడు మంచు విష్ణుతోపాటు సినీ పెద్దలు చిరంజీవి, మోహన్‌బాబు, మురళీ మోహన్‌, తమ్మారెడ్డి భరద్వాజ సహా ఇతర ప్రముఖులంతా హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీ కంటే ముందు ఈ సమావేశం జరగాల్సి ఉండగా .. రెండు సార్లు వాయిదా పడింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలు, ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తూ ఈనెలాఖరులో ఉత్తర్వులు జారీ చేయనున్న క్రమంలో నేటి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని