టాలీవుడ్‌ సీనియర్‌ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక-నిర్మాత రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) నేడు తుదిశ్వాస విడిచారు. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న 'ఆ నలుగురు' సహా...

Published : 19 Aug 2022 20:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక-నిర్మాత రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ‘ఆ నలుగురు’ సహా పలు తెలుగు చిత్రాలు తీసిన దర్శకుడు చంద్ర సిద్ధార్థకు ఈయన సోదరుడు. తెలుగు సినిమా ‘నిరంతరం’ (1995)కు రాజేంద్ర ప్రసాద్ దర్శక, నిర్మాత, రచయిత బాధ్యతలను నిర్వహించారు. ‘నిరంతరం’ మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాలకు ఎంపికై పలువురి ప్రశంసలు అందుకుంది.

‘మ్యాన్ ఉమెన్‌ అండ్ ది మౌస్’, ‘రెస్డ్యూ - వేర్ ది ట్రూత్ లైస్’, ‘ఆల్ లైట్స్, నో స్టార్స్’లాంటి ఆంగ్ల చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నింటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగులో ‘మేఘం’, ‘హీరో’ సహా పలు చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా సేవలు అందించారు. మిట్టల్‌ వర్సెస్‌ మిట్టల్‌’(2010), ‘ఆగా’(2011) వంటి హిందీ సినిమాలకు డీఓపీగా పనిచేశారు. ‘కాల్‌ ఫర్‌ ఫన్‌’(2017) ఆయన డీఓపీగా పనిచేసిన చివరి చిత్రం. రాజేంద్ర ప్రసాద్ ముంబైలో స్థిరపడ్డారు. ఆయన మృతిపట్ల చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని