ఓడింది.. గెలిచేందుకే.. ఇదే తారక్‌ జీవితం

ఏ నటుడికైనా పరాజయాలు ఎదురైతే కోలుకోవడం కష్టమే. అలా అని అక్కడే ఆగిపోతే ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోలేరు. పరాజయాలను

Updated : 20 May 2021 12:15 IST

ఏ నటుడికైనా పరాజయాలు ఎదురైతే కోలుకోవడం కష్టమే. అలా అని అక్కడే ఆగిపోతే ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోలేరు. పరాజయాలను రాబోయే విజయాలకు మెట్లుగా ఎలా మార్చుకోవాలో చేసి చూపించిన నటుడు ఎన్టీఆర్‌.

ముళ్లబాటను ఛేదిస్తూ

ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ పూలబాటేమీ కాదు. ఒక్కో అవాంతరాన్ని దాటుకొని వచ్చారు. తన ప్రతిభతో స్వయంగా నిర్మించుకున్న కోటలోనే ఆయన ఈ స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. ఓ దశలో వరుస విజయాలుంటే ఒక్కోసారి ఫ్లాప్స్‌ వెనువెంటనే  పలకరిస్తూ కష్టాల్లోకి నెట్టేసేవి. అయినా తడబడకుండా నిలబడిన విధానం ఎందరికో స్ఫూర్తిదాయకం. అలా ముళ్లబాటను ఛేదిస్తూ సొంతకోటను కట్టుకున్నారు తారక్‌.


పనంటే వల్లమాలిన ప్రేమ

ఎన్టీఆర్‌ చేసే స్టంట్స్‌, స్టెప్స్‌ ఎంత ప్రమాదకరమో ఆయన సినిమాలు చూస్తే తెలిసిపోతుంది. గాయాలవడం అనేది మామూలు విషయమే. ‘ఆది’ షూటింగ్‌ సమయంలో చేతికి తీవ్ర గాయమైంది. అది పూర్తిగా  మానకుండానే షూటింగ్‌కి వచ్చేశాడు. అలాగే 2009లో తెదేపా తరపున ప్రచారానికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌ వస్తూ ప్రమాదానికి గురయ్యారు. కొన్ని నెలలు బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.  నొప్పులు వేధిస్తున్నా, శరీరం సహకరించకున్నా చిత్రీకరణకు హాజరయ్యారు తారక్‌. ఫైట్స్‌, పాటల షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇంత సాహసం ఎందుకని అడిగితే ‘సినిమా మీద వ్యామోహం’ అని నవ్వుతూ చెబుతారు తారక్‌. 


గుండెనిండా  గాయాలే

ఎన్టీఆర్‌ జీవితంలో శారీరకంగా తగిలిన గాయాల కన్నా.. గుండెకు తగిలిన గాయాలే ఎక్కువ. అన్నింటికీ తట్టుకుని నిలబడ్డాడు తారక్‌. కుటుంబంలో అమితంగా ప్రేమించే తండ్రి హరికృష్ణ, అన్న జానకిరామ్‌ ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి కంటతడిని మిగిల్చారు. ఈ విషాదం ఆయన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఆడియో ఫంక్షన్‌ వేడుకల్లో ఇంటివద్ద మనకోసం ఓ కుటుంబం ఎదురు చూస్తుంటుంది. జాగ్రత్త వెళ్లమని చెబుతాడు తారక్‌.. తడారని గొంతుతో.


స్నేహమే జీవితం..

తెలుగు హీరోలెవరినడిగినా.. ఇండస్ట్రీలో స్నేహపూర్వక హీరో ఎవరంటే టక్కున వచ్చే సమాధానం తారక్‌.  రాజమౌళి, పూరి జగన్నాథ్‌ లాంటి దర్శకులే కాదు. ప్రభాస్‌, చరణ్‌, మహేశ్, రాజీవ్‌ కనకాలతో మంచి స్నేహబంధం ఉంది. తారక్‌ అంటే వారూ..అంతే ప్రాధాన్యతనిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని