Tollywood: ‘సార్’ మెలొడీ.. ‘హిట్ 2’ రొమాంటిక్ వీడియో.. విశ్వంత్ కొత్త చిత్రం
టాలీవుడ్ అప్‌డేట్స్. ధనుష్, అడివి శేష్ సినిమాల నుంచి కొత్త పాటలు విడుదలయ్యాయి.
హైదరాబాద్: తమిళ నటుడు ధనుష్ (Dhanush) హీరోగా టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సార్’ (Sir). ఈ చిత్రంలోని తొలి పాట గురువారం విడుదలైంది. ‘మాస్టారు మాస్టారు’ అంటూ సాగే ఈ మెలొడీని రామజోగయ్య శాస్త్రి రాశారు. జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరాలు సమకూర్చగా శ్వేతా మోహన్ ఆలపించారు. ధనుష్, సంయుక్తా మేనన్ జోడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. విద్యా వ్యవస్థ నేపథ్యంలో యాక్షన్- డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఉరికే ఉరికే..
అడివి శేష్ (Adivi Sesh), మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘హిట్ 2’ (Hit 2). డిసెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘ఉరికే ఉరికే’ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ఈ రొమాంటిక్ గీతాన్ని కృష్ణకాంత్ రచించారు. ఎం. ఎం. శ్రీలేఖ స్వరాలు సమకూర్చారు. సిధ్ శ్రీరామ్, రమ్య బెహర ఆలపించారు.
క్రైమ్ థ్రిల్లర్‌గా..
విశ్వంత్ హీరోగా సహస్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఓ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో శిల్పా మంజునాథ్, రియా సచ్‌దేవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని, ఈ నెల 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: ఆత్మాహుతి దాడిలో 93కు పెరిగిన మృతులు.. భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఘటన
-
Sports News
Team India: ధావన్ వస్తాడా...? ఇషాన్‌కే అవకాశాలు ఇస్తారా..? అశ్విన్ స్పందన ఇదీ..
-
General News
CM Jagan: త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
India News
Economic Survey 2023: లోక్‌సభ ముందు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Ileana: ఆసుపత్రిలో చేరిన ఇలియానా.. త్వరగా కోలుకోవాలంటున్న ఫ్యాన్స్