Tom Cruise: సినిమాను హిట్‌ చేసినందుకు విమానం నుంచి దూకుతూ థ్యాంక్స్‌ చెప్పిన స్టార్‌ హీరో

టామ్‌ క్రూజ్‌(Tom Cruise) తను నటించిన ‘టాప్ గన్‌: మెవరిక్‌’(Top Gun: Maverick) చిత్రాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, ఆయన చెప్పిన విధానానికి మాత్రం అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

Updated : 20 Dec 2022 12:28 IST

హైదరాబాద్‌: తన సినిమాను సూపర్‌ హిట్‌ చేసినందుకు అభిమానులకు వినూత్నరీతిలో కృతజ్ఞతలు చెప్పాడో స్టార్‌ హీరో. ఏకంగా విమానంలో నుంచి కిందకు దూకుతూ థ్యాంక్స్‌ చెప్పాడు. టామ్‌ క్రూజ్(Tom Cruise)‌.. హాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే స్టార్‌ హీరో. ఆయన నటించిన ‘టాప్‌ గన్‌:మెవరిక్‌’(Top Gun: Maverick) చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని కాసుల వర్షం కురిపించింది. ఇంత హిట్‌ను అందించిన ప్రేక్షకులకు స్టంట్‌ చేస్తూ థ్యాంక్స్‌ చెప్పాడు టామ్‌ క్రూజ్. తన అభిమానుల కోసం ఇలా చేసినట్లు స్పష్టం చేశాడు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

‘నేను ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో షూటింగ్‌లో ఉన్నాను. ఇటీవల నేను నటించిన టాప్‌ గన్‌ సినిమాను ఆదరించిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని అలరించేందుకు నేను ఎప్పుడూ ముందుంటాను. ఇది నాకు జీవితకాల గౌరవం. నేను ప్రస్తుతం ఎంతో ఎత్తులో ఉన్నాను. త్వరలోనే మరో సినిమాతో మీ ముందుకు రానున్నా’ అంటూ విమానం నుంచి కిందకు దూకుతూ వీడియో రికార్డు చేశాడు. ఈ హీరో చేసిన విన్యాసాన్ని చూసి అభిమానులు షాక్‌ అయ్యారు. కామెంట్ల రూపంలో వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఇటువంటి విన్యాసాలు చేయడంలో మీకు మీరే సాటి’ అని ఒకరు అనగా, ‘రియల్‌ హీరో’ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని