RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ఫిదా అయిన స్పైడర్ మ్యాన్.. అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు
‘స్పైడర్ మ్యాన్’ హీరో టామ్ హాలండ్ (Tom Holland) తాజా ఇంటర్వ్యూలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) గురించి మాట్లాడారు. తనకెంతో నచ్చిందని చెప్పారు.
ఇంటర్నెడ్ డెస్క్: ‘ఆర్‌ఆర్‌ఆర్’తో చరిత్ర సృష్టించాడు రాజమౌళి. తన ప్రతిభతో ప్రపంచ దేశాల ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే కాకుండా ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం గురించి ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు మాట్లాడారు. తాజాగా ‘స్పైడర్ మ్యాన్’ హీరో టామ్ హాలండ్ (Tom Holland) కూడా ఈ లిస్ట్‌లో చేరారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరలవుతోంది.
ఇటీవల ముంబయిలో జరిగిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవానికి టామ్ హాలండ్ వచ్చారు. మూడు రోజుల పాటు భారత్‌లోనే ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత్ పర్యటన గురించి చెప్పారు. అందులోనే ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) గురించి కూడా ప్రస్తావించారు. ‘‘నాకు భారత్ పర్యటన ఎన్నో మంచి జ్ఞాపకాలనిచ్చింది. ఆ పర్యటనను జీవితంలో మర్చిపోలేను. మళ్లీ భారత్‌కు వెళ్లాలనుకుంటున్నాను. మూడు రోజుల్లో ఎంతో మంది ప్రముఖులను కలిశాను. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతంగా గడిచింది. అలాగే ఈ మధ్యనే నేను ‘ఆర్‌ఆర్‌ఆర్’ చూశాను. ఆ సినిమా చాలా బాగుంది. నాకెంతో నచ్చింది’’ అని చెప్పారు. దీంతో రాజమౌళి అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
ఇక రాజమౌళి (Rajamouli) ప్రస్తుతం మహేశ్ (Mahesh babu) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీని కోసం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా