Brahmastra: వీకెండ్‌ వసూళ్లు .. పది రికార్డులు బద్దలు కొట్టిన ‘బ్రహ్మాస్త్రం’

రణ్‌బీర్‌కపూర్‌, అలియా జంటగా నటించిన ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ‘బ్రహ్మాస్త్రం’.

Updated : 13 Sep 2022 18:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటించిన ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘బ్రహ్మాస్త్రం’ (Brahmastra). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అయితే, వీకెండ్‌లో మాత్రం ఆ టాక్‌ను దాటుకుని బాక్సాఫీస్‌ వద్ద కాస్త గట్టిగానే నిలబడింది. 2022లో విజయాలు లేక సతమతవుతున్న బాలీవుడ్‌కు కొంతమేర ఊరటనిచ్చింది. వీకెండ్‌ వసూళ్ల విషయంలో ఈ చిత్రం 10 రికార్డులను బద్దలు కొట్టింది. అవేంటో చూసేయండి.

  1. బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కెరీర్‌లో ‘బ్రహ్మాస్త్రం’ బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా నిలిచింది. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం రూ.36.50 కోట్లు వసూలు చేసింది. గతంలో వచ్చిన సంజూ రికార్డు( రూ.34.75కోట్లు )ను బద్దలు కొట్టింది.
  2. ‘బ్రహ్మాస్త్రం’ వీకెండ్‌ కలెక్షన్లు చూసుకుంటే రూ.125.50 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఇది అలియాభట్‌ నటించిన సినిమాల్లో అతిపెద్ద వీకెండ్‌ గ్రాసర్‌. గతంలో ఆమె నటించిన ‘గంగూబాయి కాఠియావాడి’, ‘కళంక్‌’ చిత్రాలను ఇది దాటేసింది.
  3. రణ్‌బీర్‌కు మాత్రమే కాదు, అలియా భట్‌కు కూడా ఇది బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ మూవీ. కళంక్‌ రూ.21.60కోట్లు రాబట్టగా, ‘బ్రహ్మాస్త్రం’ రూ.36.50కోట్లు వసూలు చేసింది.
  4. 2022లో బాలీవుడ్‌లో విడుదలైన అత్యధిక చిత్రాలు మెప్పించలేకపోయాయి. కానీ, ‘బ్రహాస్త్రం’కు ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ కార్తిక్‌ ఆర్యన్‌ ‘భూల్‌ భూలయ్య2’ అత్యధికంగా రూ.14.11కోట్లు వసూలు చేయగా, ఆ రికార్డును తిరగరాస్తూ ఈ చిత్రం రూ.36.50కోట్లు వసూలు చేసింది.
  5. ఇక రణ్‌బీర్‌ కెరీర్‌లో అత్యధిక వీకెండ్‌ గ్రాసర్‌గా ‘బ్రహ్మాస్త్రం’ నిలిచింది. రూ. 125.50 కోట్లు వసూలు చేసింది. గతంలో రణ్‌బీర్‌ నటించిన సంజూ రూ.120.5కోట్లు వసూలు చేసింది.
  6. ఇక ప్రపంచవ్యాప్తంగా ‘బ్రహ్మాస్త్రం’ వీకెండ్‌ (సెప్టెంబరు 9-11) కలెక్షన్స్‌ చార్ట్‌ చూసుకుంటే రూ.225కోట్లతో చాలా హాలీవుడ్‌ చిత్రాలను దాటేసింది.
  7. కరోనా తర్వాత అత్యధిక  ఓపెనింగ్‌ వసూళ్లు సాధించిన చిత్రంగానూ ‘బ్రహ్మాస్త్రం’ నిలిచింది. గతంలో అక్షయ్‌, కత్రీనా జంటగా నటించిన సూర్యవంశి ఓపెనింగ్‌ డే కలెక్షన్స్‌ రూ.26.29 కోట్లు కాగా, బ్రహ్మాస్త్రం రూ.36.50 కోట్లు వసూలు చేసింది.
  8. ఆస్ట్రేలియాలోనూ ‘బ్రహ్మాస్త్రం’ అదరగొట్టింది. మిలియన్‌ డాలర్లకు చేరువగా (903k డాలర్లు) వసూళ్లు రాబట్టిన బాలీవుడ్‌ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.
  9. వీకెండ్‌ ఓపెనింగ్‌లో రూ.100కోట్లు వసూలు చేసిన  బాలీవుడ్‌ చిత్రంగా ‘బ్రహ్మాస్త్రం’ నిలిచింది.
  10. హిందీలోనే కాదు, ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతున్న చిత్రంగా ‘బ్రహ్మాస్త్రం’ రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది భాషల్లో ఈ చిత్రానికి చక్కని ఆదరణ లభిస్తున్నట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీరాయ్‌లాంటి తారలందరూ నటించడం, గ్రాఫిక్‌ హంగులతో ఓపెనింగ్స్‌ బాగున్నా, లాంగ్‌రన్‌లో ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది వేచి చూడాలి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని