RRR Collections: ‘ఆర్ఆర్ఆర్‌’ @ 3... టాప్‌ 10లో మిగిలిన తొమ్మిది ఏవంటే?

మన దేశంలో టాప్‌ 10 గ్రాస్‌ వసూళ్లు సాధించిన సినిమాలు, వాటి లెక్కేంటో ఓ సారి చూద్దామా!

Published : 09 Apr 2022 01:59 IST

మన దేశంలో టాప్‌ 10 సినిమాలేవి అంటే... సమాధానం చెప్పడం కష్టం. అయితే టాప్‌ 10 గ్రాస్‌ వసూళ్లు సాధించిన సినిమాలు ఏవంటే లెక్క చెప్పేయొచ్చు. ‘ఆర్‌ఆర్ఆర్‌’ భారీ కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో.. అత్యధిక వసూళ్ల ముచ్చట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. టాప్‌ గ్రాసర్‌ లిస్ట్‌లో ఉన్న ఆ పది సినిమాలేంటి, వాటి లెక్కేంటో ఓ సారి చూద్దామా!


1. దంగల్‌ - ₹2,024 కోట్లు


2. బాహుబలి : ది కంక్లూజన్‌ - ₹1,810 కోట్లు


3. ఆర్‌ఆర్‌ఆర్‌ - ₹969 కోట్లు


4. బజరంగీ భాయిజాన్‌ - ₹969 కోట్లు


5. సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ - ₹967 కోట్లు


6. పీకే - ₹854 కోట్లు


7. 2.0 - ₹800 కోట్లు


8. బాహుబలి: ది బిగినింగ్‌ - ₹650 కోట్లు


9. సుల్తాన్‌ - ₹623 కోట్లు


10. సంజు  - ₹587 కోట్లు


తారక్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి నిర్మించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. తొలి రోజుల్లో బాలీవుడ్‌లో మోస్తరు వసూళ్లు సాధించినా.. తర్వాత పుంజుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.969 కోట్లు గ్రాస్‌ సాధించింది. ఇంకా ‘ఆర్‌ఆర్ఆర్‌’ వసూళ్ల ప్రవాహం సాగుతోంది. రూ. వెయ్యి కోట్ల వసూళ్లకు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల చిత్రబృందం సక్సెస్‌ వేడుకను కూడా నిర్వహించింది.

గమనిక: ఈ వసూళ్ల వివరాలు వికీపీడియా ఆధారంగా తీసుకున్నవి. ఫైనల్‌ గ్రాస్‌ వసూళ్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని