YS Jagan: ‘థ్యాంక్యూ సీఎం’ అంటూ స్టార్ల ట్వీట్‌లు.. ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌లు!

ప్రముఖ నటులు చిరంజీవి, మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా ఏపీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Published : 11 Feb 2022 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘థ్యాంక్యూ సీఎం’ (#ThankyouCM), ‘థ్యాంక్యూ వైఎస్‌ జగన్‌’ (#ThankyouYSJagan), చిరంజీవి (#Chiranjeevi), మహేశ్‌బాబు (#MaheshBabu), ప్రభాస్‌ (#Prabhas).. ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్న హ్యాష్‌ట్యాగ్‌లివి. స్టార్‌ హీరోలు చిరంజీవి, మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి ట్వీట్‌లు ఇందుకు కారణమయ్యాయి. చిత్ర పరిశ్రమలో నెలకొన్న అనేక సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, ఆర్‌. నారాయణమూర్తి, రాజమౌళి, కొరటాల శివ తదితరులు భేటీ అయిన సంగతి తెలిసిందే.

తమ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి మీడియా వేదికగా ధన్యవాదాలు తెలియజేసిన వారు సోషల్‌ మీడియా వేదికగా మరోసారి తెలిపారు. చిరంజీవి, మహేశ్‌బాబు, రాజమౌళి తదితరులు ట్విటర్‌లో సీఎం, మంత్రి పేర్నినానికి థ్యాంక్స్‌ చెప్పారు. #ThankyouSriYSJagan అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. సంబంధిత పోస్ట్‌లను అత్యధికమంది నెటిజన్లు లైక్‌ చేసి.. రీట్వీట్‌ చేశారు. మరోవైపు, ఒకే ఫ్రేమ్‌లో అగ్ర హీరోలు, దర్శకులు కనిపించటంతో సినీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. సంబంధిత ఫొటోలు, వీడియోలను హీరోల పేర్ల హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విటర్‌లో షేర్‌ చేస్తున్నారు. అలా ‘సీఎంతో సినీ దర్శకనటుల భేటీ’ అంశం ట్రెండ్‌ అయింది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని