Leo: బిడ్డ పుట్టినా.. అమ్మ మరణించినా.. ‘లియో’ చిత్రీకరణలో టెక్నిషియన్లు!

తమ సినిమా కోసం కశ్మీర్‌లో ఎముకలు కొరికే చలిలో పనిచేసిన వారందరికీ ‘లియో’ నిర్మాత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. విజయ్‌ హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది.

Published : 24 Mar 2023 19:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మాస్టర్‌’ (Master) తర్వాత విజయ్‌ (Thalapathy Vijay) హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) తెరకెక్కిస్తోన్న చిత్రం ‘లియో’ (Leo). త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, ప్రియా ఆనంద్‌, అర్జున్‌, మన్సూర్‌ అలీఖాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కశ్మీర్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో టెక్నిషియన్స్‌ ఎంత కష్టపడ్డారో తెలియజేస్తూ నిర్మాణ సంస్థ ‘సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో’ ఓ వీడియో విడుదల చేసింది. 7 నిమిషాలకుపైగా ఉన్న ఆ వీడియోలో ఎంతోమంది కార్మికుల శ్రమ కళ్లకు కట్టి కనిపిస్తుంది. సినిమా అంటే వారికి ఎంత ప్రేమో అర్థమవుతోంది.

ఎముకలు కొరికే చలిలో (- 2 డిగ్రీలు) తెల్లవారుజామున 3 గంటలకే లేచి, పనులు ప్రారంభించేవారమని టీమ్‌ సభ్యులు తెలిపారు. సాయంత్రంకాగానే ముక్కు నుంచి రక్తం కారుతుండేదని, అయినా దాన్ని సమస్యగా చూడలేదని వివరించారు. చిత్రీకరణకు రాత్రే అనుకూలంగా ఉండేదన్నారు. నిర్విరామంగా మంచు కురుస్తుండడంతో కెమెరా లెన్స్‌లు స్పష్టంగా కనిపించేవి కాదని పేర్కొన్నారు. ‘‘అసిస్టెంట్‌ డైరెక్టర్లలో ఒకరికి ఈ షెడ్యూల్‌లోనే వివాహం జరిగింది. రెండు రోజుల్లోనే తిరిగొచ్చారు. మా టీమ్‌ సభ్యుల్లోని ఒకరికి బిడ్డ పుడితే తాను ఇప్పటి వరకూ ఇంటికి వెళ్లలేదు. ఛాయాగ్రాహకుడు మనోజ్‌ తన తల్లిని కోల్పోయారు. ఆమె అంత్యక్రియలు ముగిసిన వెంటనే మళ్లీ వచ్చి చిత్రీకరణలో పాల్గొన్నారు’’ అని ‘లియో’ టీమ్‌లోని ఒకరు తెలిపారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు