Trisha: త్రిష మరోసారి లవ్‌లో ఫెయిల్‌ అయ్యారా..?

తమ అభిమాన నటి, అగ్ర కథానాయిక త్రిషకు (Trisha) వ్యక్తిగత జీవితంలో మరో ఎదురుదెబ్బ తగిలిందా..? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.....

Updated : 21 Aug 2022 11:11 IST

చెన్నై: నటి త్రిషకు (Trisha) వ్యక్తిగత జీవితంలో మరో ఎదురుదెబ్బ తగిలిందా..? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. సోషల్‌మీడియా ఖాతాలో ఆమె తాజాగా పెట్టిన ఓ పోస్టు చర్చనీయాంశంగా మారింది.

‘వర్షం’తో తెలుగు తెరకు పరిచయమై.. చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన నటించి అందర్నీ మెప్పించారు త్రిష. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో వరుస ప్రాజెక్ట్‌లు చేసి అగ్ర కథానాయికగా రాణించిన ఆమె..  తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘విషపూరితమైన మనస్వత్తం కలిగిన వ్యక్తులు వాళ్లంతట వాళ్లే నీతో మాట్లాడటం మానేయడం ఎంతో సంతోషంగా ఉంది. దీన్ని చూస్తుంటే చెత్త దానంతటదే తొలగిపోయినట్లు ఉంది’’ అని రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘త్రిష మరోసారి ప్రేమలో విఫలమయ్యారా?’, ‘ఇంతకీ ఆమె ఎవర్ని ఉద్దేశిస్తూ ఈ పోస్టు పెట్టారు’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక, గతంలో కోలీవుడ్‌ సినీ నిర్మాత వరుణ్‌తో త్రిష ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబపెద్దల సమక్షంలో వీరి నిశ్చితార్థమూ జరిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ పెళ్లి కాకముందే వీళ్లిద్దరూ విడిపోయారు. ఈ బ్రేకప్‌ నుంచి బయటపడిన తర్వాత టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్‌ హీరోతో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ బంధం కూడా మధ్యలోనే నిలిచిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని