Ponniyin Selvan: అవును అవి నిజమైన నగలే.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన త్రిష

చోళ సామ్రాజ్య వైభవాన్ని, అప్పటి రాజకీయ తంత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు అగ్ర

Published : 27 Sep 2022 01:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చోళ సామ్రాజ్య వైభవాన్ని, అప్పటి రాజకీయ తంత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు అగ్ర దర్శకుడు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా తొలి భాగం సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కథానాయిక త్రిష ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో త్రిష చోళ దేశపు రాకుమారి కుందవై పాత్రను పోషిస్తున్నారు. తన పాత్రకు ధరించిన నగలు నిజమైనవేని అన్నారు.

‘‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో నా పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ఇందులో నేను చోళ రాకుమారిగా నటిస్తున్నారు. కుందవై పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఆనాటి రాజుల ఆహార్యం తలపించేలా దుస్తులు, నగలను ఎంపిక చేశారు. కొన్ని సన్నివేశాల్లో నేను నిజమైన నగలే ధరించాను. మాకు సహకారం అందించినందుకు ధన్యవాదాలు. మణిరత్నం చిత్రంలో నేనూ ఒక భాగం కావటం సంతోషంగా ఉంది. నా పాత్రకు నేను న్యాయం చేశానని అనుకుంటున్నా’’ అని త్రిష అన్నారు. ఇక ఈ చిత్రం విక్రమ్‌, కార్తి, జయంరవి, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, శోభిత ధూళిపాళ, శరత్‌కుమార్‌, పార్తిబన్‌ తదితరులు నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని