Trisha: ‘లియో’ నుంచి త్రిష తప్పుకొన్నారా? క్లారిటీ ఇచ్చిన నటి తల్లి!
Trisha: విజయ్ కథానాయకుడిగా లోకశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘లియో’ నుంచి త్రిష తప్పుకొన్నారన్న వార్తలపై ఆమె తల్లి క్లారిటీ ఇచ్చారు.
చెన్నై: విజయ్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’. త్రిష కథానాయిక. ఇటీవల చిత్ర బృందం షూటింగ్ కోసం కశ్మీర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్రిష సినిమా నుంచి తప్పుకొన్నారంటూ కోలీవుడ్‌లో వార్తలు హల్‌చల్ చేయడం మొదలు పెట్టాయి. కశ్మీర్‌లోని తీవ్ర ప్రతికూల వాతావరణం కారణంగా త్రిష ఇబ్బంది పడ్డారని, చెన్నై తిరిగి వచ్చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై త్రిష తల్లి ఉమ కృష్ణ స్పందించారు. ‘లియో’ నుంచి త్రిష తప్పుకోలేదని స్పష్టం చేశారు.
‘త్రిష ఇంకా కశ్మీర్‌లోనే ఉంది. ఆమెకు సంబంధించిన సీన్లను తెరకెక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలేవీ నిజం కాదు’ అని త్రిష తల్లి స్పష్టం చేశారు.
14 ఏళ్ల తర్వాత..
విజయ్, త్రిష కలిసి దాదాపు 14ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రమిది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు, సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మిస్కిన్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్,, మాథ్యూ థామస్, సాండీ మాస్టర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pawan Kalyan: వచ్చే ఎన్నికల తర్వాత తెదేపా - జనసేన ప్రభుత్వమే: పవన్ కల్యాణ్
-
Indigo: విమానంలోనూ వృత్తి ధర్మం చాటారు.. చిన్నారి ప్రాణాలు కాపాడారు
-
Mayawati: ఆ కూటములతో కలిసే ప్రసక్తే లేదు: మాయావతి
-
Nightclub Fire: నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి
-
Nimmagadda: ప్రజాస్వామ్యం బలహీన పడేందుకు అంతర్గత శత్రువులే కారణం: నిమ్మగడ్డ
-
Asian Games: భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు