Brinda: త్రిష వెబ్‌సిరీస్‌ ‘బృందా’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఆసక్తిగా టీజర్‌

పోలీస్‌ ఆఫీసర్‌గా త్రిష నటించిన వెబ్‌సిరీస్‌ ‘బృందా’. ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ సోమవారం ఖరారైంది.

Published : 08 Jul 2024 22:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటికే పలువురు హీరో- హీరోయిన్లు వెబ్‌సిరీస్‌ల్లో నటించి, ప్రేక్షకులను అలరించారు. త్వరలోనే త్రిష (Trisha) ఆ జాబితాలో చేరనున్నారు. ఆమె నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘బృందా’ (Brinda). సూర్య వంగల దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ విడుదల తేదీ సోమవారం ఖరారైంది. ఓటీటీ ‘సోనీలివ్‌’ (Sony Liv)లో ఆగస్టు 2 నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీలో విడుదలవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీమ్‌.. టీజర్‌ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్‌ చేసింది. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ సిరీస్‌లో ఇంద్రజిత్‌ సుకుమారన్‌, ఆమని, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

హీరోయిన్‌గా అవకాశాలు అందుకోవడంలో త్రిష ఇప్పటికీ ముందు వరుసలోనే ఉన్నారు. చిరంజీవి ‘విశ్వంభర’ (Vishwambhara), కమల్‌ హాసన్‌ ‘థగ్‌ లైఫ్‌’, అజిత్‌ ‘విదా ముయార్చి’, మోహన్‌లాల్‌ ‘రామ్‌’ తదితర చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు