‘మీరు డాక్టర్‌ను కలిస్తే మంచిది’ 

తమ అభిమాన తారలపై సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. అందులో కొందరు అభిమానం పేరిట నటులను ట్రోల్‌ చేస్తూ ఉంటారు. వాటికి కొందరు తారలు ఘాటుగానే రిప్లై ఇస్తారు. తాజాగా నటుడు మాధవన్‌ను ఒక అభిమాని ‘డ్రగ్‌

Published : 06 Jan 2021 01:28 IST

ట్రోలర్‌కు మాధవన్‌ రిప్లై

చెన్నై:తమ అభిమాన తారలపై సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. అందులో కొందరు అభిమానం పేరిట నటులను ట్రోల్‌ చేస్తూ ఉంటారు. తాజాగా నటుడు మాధవన్‌ను ఒక అభిమాని ‘డ్రగ్‌ ఎడిక్ట్‌’అంటూ చేసిన కామెంట్‌కు ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. 
వివరాల్లోకి వెళితే.. సదరు నెటిజన్‌ ట్విట్టర్‌ వేదికగా ‘మాధవన్‌ ఒకప్పటి నా అభిమాన నటుడు కానీ ప్రస్తుతం ఆయన మద్యం, మాదక ద్రవ్యాలు సేవిస్తూ కెరీర్‌ నాశనం చేసుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఆయన నటించిన తొలి సినిమాలో ఎంతో ఆకర్షణీయంగా ఉండేవారు. ప్రస్తుతం అలా లేరు’అని రాసుకొచ్చారు. దీనికి మాధవన్‌ స్పందిస్తూ ‘ఈ కామెంట్‌ చూస్తుంటే మీకు అజీర్తి రోగం ఉందేమోనని నా సందేహం. మీ ఆనారోగ్యానికి నేను చాలా చింతిస్తున్నాను. కచ్చితంగా మీకు ఒక మంచి వైద్యుని అవసరం ఉంది’ అంటూ ఏడుస్తున్న ఎమోజీలను ఉంచారు. మాధవన్‌ స్పందనను చాలా మంది నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఆయన్ను సపోర్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం మాధవన్‌ నటించిన ‘మార’ అనే తమిళ్‌ మూవీ జనవరి 8న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.

ఇవీ చదవండి!

‘ది రోజ్‌ విల్లా’భయపెడుతోంది!

‘మై నే ప్యార్‌కియా’లో నటించొద్దనుకున్నాను: భాగ్యశ్రీ

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని