Kangana: ‘నైజీరియా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉందా’?

సామాజిక అంశాల‌పై త‌న‌దైన శైలిలో మాట్లాడి  వార్త‌ల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌.

Published : 19 May 2021 01:30 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: సామాజిక అంశాల‌పై త‌న‌దైన శైలిలో మాట్లాడి వార్త‌ల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌. మ‌రోసారి ఆమె చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దమయ్యాయి. ఉత్తర్‌ప్ర‌దేశ్‌, బిహార్ రాష్ట్రాల్లో ఉన్న గంగాన‌దిలో ఇటీవ‌ల పెద్ద సంఖ్య‌లో శ‌వాలు కొట్టుకువ‌చ్చాయి. ఇదే సంఘ‌ట‌న  ప‌లుమార్లు జ‌ర‌గ‌డంతో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా కొన్ని రోజుల క్రితం దీనిపై స్పందించింది కంగ‌నా. ఇదంతా గంగాన‌దిలో జ‌రిగింది కాద‌ని అన్నారు. సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయిన సంబంధిత ఫొటోలు, వీడియోలు నైజీరియా దేశంలో చోటు చేసుకున్న‌వ‌ని చెప్పుకొచ్చారు. కంగ‌నా వ్యాఖ్య‌ల్ని కొంద‌రు ఖండిస్తూ.. ట్విట‌ర్ వేదిక‌గా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ‘నైజీరియా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉందా’ అంటూ ట్రోలింగ్‌ మొదలు పెట్టారు. స‌రైన ఆధారాలు చూప‌కుండా మీరెలా చెప్తున్నారని అడుగుతున్నారు.

కొవిడ్ నెగెటివ్‌..

కంగనా ఇటీవ‌ల కొవిడ్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో  కంగనా క‌రోనాని జ‌యించింది. తాజాగా నిర్వ‌హించిన కొవిడ్ ప‌రీక్ష‌ల్లో ఆమెకి నెగెటివ్ వ‌చ్చింది. ఆ  శుభ‌వార్త‌ని అభిమానుల‌తో పంచుకుంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ‘కొవిడ్ విష‌యంలో నేను ఎక్స్‌ప‌ర్ట్‌ని కాదు కానీ దాన్ని ఎదుర్కొనేందుకు నేను చేసిన పోరాటాన్ని వివ‌రిస్తున్నాను. మీకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నాను’  అని పేర్కొంది.









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని